కర్ణాటకలో మరోసారి హిజాబ్ వివాదం మళ్లీ రగులుతోంది. వెలుగులోకి వచ్చింది. పాఠశాలలు, కళాశాలల్లో హిజాబ్ పై నిషేధాన్ని సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన దాదాపు నెల తర్వాత.. మంగళూరు యూనివర్సిటీ కాలేజీకి చెందిన ముస్లిం విద్యార్థుల బృందం తరగతి గదుల్లో హిజాబ్ ధరించడానికి అనుమతించాలని మెమొరాండం సమర్పించడంతో కర్ణాటకలో హిజాబ్ గొడవ మరోసారి తెరపైకి వచ్చింది. నివేదికల ప్రకారం, హైకోర్టు ఉత్తర్వును ఉల్లంఘిస్తూ కొంతమంది ముస్లిం బాలికలు ఇస్లామిక్ హిజాబ్ ధరించి తరగతులకు హాజరవుతున్నారని ఆరోపిస్తూ మంగళూరులోని యూనివర్శిటీ కాలేజీకి చెందిన కొంత మంది విద్యార్థుల బృందం కళాశాల అధికారులపై నిరసన వ్యక్తం చేయడంతో మే 26న వివాదం చెలరేగింది.
https://twitter.com/KeypadGuerilla/status/1529707094475427840?s=20&t=OZSI8I33aPI3OsgsntgKWA
44 మంది ముస్లిం విద్యార్థులు హిజాబ్ ధరించి కాలేజీకి వెళ్లేందుకు కాలేజీ యాజమాన్యం అనుమతించగా, తమను బలవంతంగా కాలేజీ యూనిఫాం ధరించేలా చేస్తున్నారని నిరసనలో విద్యార్థులు వాదించారు. తరగతి గదుల్లో కూడా కొందరు హిజాబ్ ధరించారని విద్యార్థులు ఆరోపించారు. కళాశాల ప్రాంగణంలో ఒకే రకమైన నిబంధనలను అమలు చేయడంలో విఫలమైనందుకు కళాశాల ప్రిన్సిపాల్ సహా ఇతర సంబంధిత అధికారులపై కూడా నిరసనలకు దిగారు. స్థానికంగా ఉన్న ఓ రాజకీయ నాయకుడి నుంచి కళాశాల అధికారులు ఒత్తిడికి గురవుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
“హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని మేం డిమాండ్ చేస్తున్నాం, మేం కళాశాల అధికారులకు మెమోరాండా సమర్పించినప్పటికీ.. వారు దానిని అమలు చేయడం లేదు. అప్పుడు PTA సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తల్లిదండ్రుల తరపు ప్రతినిధి కోర్టు ఉత్తర్వును అనుసరించాలని పట్టుబట్టారు, అప్పుడు వారు సిండికేట్ సమావేశంలో ఈ విషయాన్ని నిర్ణయించమని చెప్పారు”అని నిరసనలో పాల్గొన్నా ఒక విద్యార్థి చెప్పాడు.
విద్యార్థుల నిరసనలకు భయపడి అధికారులు ఆర్డర్‌ను అమలు చేయాలని నిర్ణయించుకుంటున్నారని.. కానీ కొంతమంది అధ్యాపకులు ముస్లిం బాలికలను తరగతి గదుల్లో హిజాబ్ ధరించమని ప్రేరేపిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. మంగళూరు విశ్వవిద్యాలయం సిండికేట్ మే 16న సమావేశాన్ని నిర్వహించింది, అక్కడ వారు హిజాబ్ ధరించడంపై నిషేధంతో సహా విద్యార్థులకు డ్రెస్ కోడ్‌ను అమలు చేయడానికి ఆమోదించారు.
అయితే కొంతమంది ముస్లిం విద్యార్థులు తాము హిజాబ్ ధరించలేదని, కాలేజ్ యూనిఫాంపై స్కార్ఫ్‌లతో తలలు కప్పుకున్నామని.. అయినా కాలేజీలో చేరడానికి ముందు వారికి అదే విధంగా తెలియజేశారని.. ఇస్లామిక్ దుస్తులు విద్యార్థులకు యూనిఫాంలో భాగమని ఆ విద్యార్థులు వాదించారు.
“అయితే క్లాసుల్లో హిజాబ్ అనుమతించబడదని, అందరూ యూనిఫాంలో రావాలని పేర్కొంటూ మే 16న కళాశాల నుంచి మెసేజ్ రూపంలో మాకు అనధికారిక ప్రకటన వచ్చింది” అని ఒక ముస్లిం విద్యార్థి చెప్పింది. మేం ఈ విషయమై ఒక మెమోరాండం సమర్పించామని.. ఈ విషయంలో జిల్లా డిప్యూటీ కమిషనర్‌కు న్యాయం చేయాలని కోరామని చెప్పారు.
https://twitter.com/ANI/status/1529851340461318144?s=20&t=tclMzhF36QkaKi9FLssFvQ