ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ కు కర్నాటక హైకోర్టు షాక్ ఇచ్చింది. జాతీయ వాదాన్ని, భారతీయత ను ఎగతాళి చేయటం కమల్ కు బాగా అలవాటు. ఇటువంటి అలవాట్లు తగ్గించుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. తమిళం నుంచే కన్నడ పుట్టిందంటూ కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలలను కర్ణాటక హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కమల్ హాసన్ కావచ్చు లేదా మరెవరైనా కావచ్చు.. ఎంత పెద్ద యాక్టర్ అయినప్పటికీ ఏ పౌరుడి మనోభావాలను దెబ్బతీసే హక్కు లేదని హెచ్చరించింది. ఆయన వ్యాఖ్యలకు ఆధారాలు ఏంటని ప్రశ్నించిన నాయస్థానం.. ఒక్క క్షమాపణ చెబితే అన్నీ పరిష్కారమయ్యేవని వ్యాఖ్యానించింది. దీంతో కమల్ హాసన్ పరువు కాస్త మురికి కాల్వ లో కలిసిపోయింది.
……
అహంకారంతో వ్యవహరించే వ్యక్తిగా కమల్ హాసన్ కు పేరు ఉంది. జాతీయ వాదాన్ని, భారతీయ సంస్క్రతీ సాంప్రదాయాలను ఎగతాళి చేయటం ఆయనకు అలవాటు. కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం చెన్నైలో జరిగిన సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో కమల్‌హాసన్ మాట్లాడుతూ. ‘కన్నడం.. తమిళం నుంచి పుట్టింది’ అని కామెంట్ చేశారు. ఉయిరే, ఉరవే తమిళే ..అంటే,, తన ప్రాణం, బంధుత్వం అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన కమల్ హాసన్ .. అవాకులు, చవాకులు పేలారు. కన్నడ భాషను, కన్నడ నటులను ఎగతాళి గా మాట్లాడారు.
…..
తమిళ భాషను పొగడటం మీద ఎవరికీ ఇబ్బంది లేదు, మాతృభాష ను అంతా మెచ్చుకొంటూ ఉంటారు. కానీ,, అయితే తమిళం నుంచి కన్నడ పుట్టిందన్న కమల్ వ్యాఖ్యలపై కన్నడ సంఘాలు భగ్గుమన్నాయి. బెంగళూరులో థగ్‌లైఫ్ సినిమా బ్యానర్లను కొందరు ఆందోళనకారులు చించివేశారు. ‘కర్ణాటకలో మీకు వ్యాపారం కావాలి.. కానీ కన్నడ భాషను అవమానిస్తారా?’ అని ధ్వజమెత్తారు. మే నెల 30లోగా కమల్‌హాసన్ క్షమాపణలు చెప్పకపోతే ‘థగ్‌లైఫ్’ను బహిష్కరిస్తామని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ) అల్టిమేటం జారీచేసింది. డెడ్‌లైన్ ముగిసినా కమల్‌హాసన్ నుంచి సరైన స్పందన రాకపోవడంతో ‘థగ్‌లైఫ్’ చిత్రాన్ని బ్యాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయం తీసుకుంది.
…
దీని మీద కూడా కమల్ హాసన్ ఎగతాళి గానే మాట్లాడారు. తప్పు చేస్తేనే తాను క్షమాపణలు చెబుతానని కమల్ కామెంట్స్ చేశారు. ‘గతంలో కూడా తన మీద ఇలాంటి బెదిరింపులు చాలానే వచ్చాయి అనీ,, తాను అస్సలు క్షమాపణలు చెప్పను అని తెగేసి చెప్పారు. ఈ లోగా సినిమా నిర్మాతలు ఇరకాటంలో పడ్డారు. కమల్ హాసన్ మొండి వైఖరి తమ పీకల మీదకు వచ్చిందని గ్రహించారు. దీంతో నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ .. కర్నాటక హైకోర్టు లో ఒక పిటిషన్ దాఖలు చేశారు. సినిమా విడుదలను అడ్డుకోవద్దని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసు శాఖ, చలనచిత్ర వాణిజ్య సంస్థలను ఆదేశించాలని పిటిషన్లో కోరారు.
…..
దీని మీద విచారణ చేపట్టిన కర్నాటక హైకోర్టు..కమల్ హాసన్ వైఖరి మీద మండిపడింది. తమిళం నుంచి కన్నడ పుట్టిందనడానికి ఆధారాలు ఎక్కడ ఉన్నాయి? కర్ణాటక ప్రజలు ఏమి అడిగారు? కేవలం క్షమాపణ మాత్రమే అని జస్టిస్ నాగ ప్రసన్న సూటిగా ప్రశ్నించారు. ఈ పరిస్థితులకు కారణం కమల్ హాసన్ అని, అటువంటప్పుడు ఆయన ఎందుకు క్షమాపణ చెప్పరు.. అని ప్రశ్నలు కురిపించారు. అసలు కమల్ హాసన్ ఈ లెక్కలు తేల్చటానికి.. ఏమయినా చరిత్రకారులా? లేక భాషావేత్తనా? అని జస్టిస్ ప్రసన్న అసహనం వ్యక్తం చేశారు. ప్రజల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం భావ్యం కాదని హితవు పలికారు.
…..
గతంలో కూడా కమల్ హాసన్ భారతీయ సంస్క్రతి, సంప్రదాయాల మీద వెటకారంగా మాట్లాడారు. ఈ పద్దతి సరి కాదని చెప్పినప్పటికీ, ఆయన పద్దతి మార్చుకోలేదు. ఇప్పుడు కూడా కన్నడ ప్రజల మనోభావాలను దెబ్బతీసేందుకు ప్రయత్నం చేసి, బోర్లా పడ్డారు.