
కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కరీంనగర్లో కొలువుదీరనున్నాడు. అందుకోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కరీంనగర్లో 10ఎకరాల స్థలాన్ని ఆలయ నిర్మాణం కోసం టీటీడీకి కేటాయించింది. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ చొరవతో ఇందుకు అడుగులు పడుతున్నాయి. కరీంనగర్ టీటీడీ ఆలయ నిర్మాణ అనుమతి పత్రాలను టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి…గంగుల కమలాకర్, వినోద్ కుమార్ కు అందజేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి మేరకు ఏపీ సీఎం జగన్ ఆదేశాలతో కరీంనగర్ పట్టణంలో 20 కోట్ల వ్యయంతో టిటిడి ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తున్నామని, మే 31వ తేదీన ఉదయం 7గం. 26 నిమిషాలకు శంకుస్థాపన కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణలతో నిర్వహిస్తామని సుబ్బారెడ్డి తెలిపారు.
ఆగమశాస్త్రం ప్రకారం కరీంనగర్ పద్మనగర్లో నిర్మించే శ్రీవెంకటేశ్వర ఆలయం యెక్క అంతరాలయం, గోపురాలు, బాహ్యాలయ నిర్మాణాల నమూనాలతో పాటు మూల విరాట్టు, పోటు, ప్రసాధ వితరణ కేంద్రం, తదితర అన్ని అంశాలను పరిశీలించనున్నారు. వీలైనంత త్వరలో ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు సుబ్బారెడ్డి.