కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతితో కన్నడ చిత్రసీమ శోకసంద్రంలో మునిగిపోయింది. బంధుమిత్రులు, అభిమానులు, సినీప్రముఖులు ఆయన మరణవార్త విని దిగ్భ్రాంతి చెందారు. పునీత్ కడచూపు కోసం బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రికి లక్షలాదిగా తరలివస్తున్నారు. వారిని అదుపుచేయడం పోలీసులవల్ల కావడం లేదు. కర్నాటకలో హై అలర్ట్ ప్రకటించారు. అభిమానుల దర్శనార్థం భౌతికకాయాన్ని బెంగళూరు కంఠీరవ స్టేడియంలో ఉంచేందుకు కర్నాటక సర్కారు అనుమతించింది. ఉదయం జిమ్ చేస్తుండగా గుండెపోటు రావడంతో హుటాహుటిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆయన్ని బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నం ఫలించలేదు.




