కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో చనిపోయారు. శుక్రవారం ఉదయం గుండెపోటు రావడంతోపునీత్ ను బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. కన్నడ సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న సమయంలో చిన్న వయసులోనే కన్నుమూయడం పట్ల అభిమానులు, కన్నడ సినీ ప్రముఖులు విషాదంలో మునిగిపోయారు.
న్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించారు. శుక్రవారం ఉదయం గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు ఐసీయూలో ఉంచి డాక్టర్లు చికిత్స చేశారు. కానీ డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆయన మరణించినట్టు డాక్టర్లు ధృవీకరించారు. పునీత్ రాజ్ కుమార్ కు ప్రస్తుతం 46 ఏళ్లు. ఎంతో కెరీర్ ఉండి, ఇంత చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడం పట్ల అభిమానులు, సినీ ప్రముఖులు విషాదంలో మునిగిపోయారు. పునీత్ రాజ్‌కుమార్ మరణవార్త గురించి తెలిసి సినీ ప్రముఖులు, అభిమానులు బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలి వస్తున్నారు.
కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కుమారుడు పునీత్. ఆయన సినీ వారసుడిగా తెరంగేట్రం చేశాడు. బాలనటుడిగానే జాతీయ అవార్డు గెలుచుకున్న పునీత్…హీరోగాఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. పునీత్ గాయకుడు కూడా. పునీత్ హీరోగా 29 సినిమాలు వచ్చాయి. ఈఏడాది ఏప్రిల్ లో యువరత్న సినిమా విడుదలైంది. పునీత్ కు భార్య అశ్వనీ రేవంత్, కుమార్తెలు ధ్రితి, వందిత ఉన్నారు.