తెలుగు బిజెపి నాయకునికి కీలక బాధ్యత అప్పగించారు. మిజోరాం గవర్నర్ గా ఉన్న కంభంపాటి హరిబాబుని ఒడిశా గవర్నర్ గా బదిలీ చేశారు. ఆంధ్రప్రదేశ్ బిజెపి రాజకీయాల్లో సామ్యుడైన నాయకుడిగా ఆయనకు పేరు ఉంది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కి ఆయన ప్రియ శిష్యుడు.
ఆంధ్ర యూనివర్సిటీలో ఏబీవీపీ నాయకుడిగా పని చేస్తున్నప్పుడు వెంకయ్య నాయుడు అనుచరుడిగా హరిబాబు గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత కాలంలో ఆంధ్రా యూనివర్సిటీ లెక్చరర్ గా జాయిన్ అయ్యి ప్రొఫెసర్ స్థాయికి ఎదిగారు. భారతీయ జనతా పార్టీలు రాజకీయ ప్రస్థానం కొనసాగించారు. తెలుగుదేశంతో పొత్తు ఉన్న సమయంలో ఎమ్మెల్యేగా కూడా సేవలు అందించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షునిగా ఆయన పని చేశారు.
అనంతరం విశాఖపట్నం ఎంపీగా పని చేశారు.అనంతరం 2021 నవంబరు 6న మిజోరం గవర్నర్‌గా నియమితులయ్యారు. సెప్టెంబరులో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లో చికిత్స పొంది కోలుకున్నారు. అనారోగ్యం కారణంగా ఆయన విధులకు హాజరుకాలేని పరిస్థితి ఉండటంతో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డికి కొన్నాళ్లు ఆ రాష్ట్ర అదనపు బాధ్యతలు అప్పగించారు. కంభంపాటి ఇటీవలే అనారోగ్యం నుంచి కోలుకుని తిరిగి మిజోరం గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొనే సరిహద్దు రాష్ట్రం ఒడిశాకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది.
మిజోరాం గవర్నర్ గా జనరల్ వీకే సింగ్ ను నివారిస్తుంది .ఆయన 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి కేంద్రమంత్రిగా పనిచేశారు. 2024 ఎన్నికల్లో బీజేపీ నాయకత్వం ఆయనకు టికెట్ ఇవ్వలేదు. అందుకు బదులుగా ఇప్పుడు గవర్నర్ బాధ్యతలు కట్టబెట్టింది.
కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్‌కుమార్ భల్లాను మణిపుర్ గవర్నర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. 2019 నుంచి 2024 ఆగస్టు వరకు సుదీర్ఘకాలం కేంద్రహోంశాఖ కార్యదర్శిగా పనిచేసిన భల్లాకు మణిపుర్ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది. మరోవైపు కేరళ గవర్నర్‌గా ఉన్న ఆరిఫ్ మహమ్మద్‌ఖాన్‌ను బిహార్‌కు, అక్కడ గవర్నర్‌గా ఉన్న రాజేంద్రవిశ్వనాథ్ ఆర్లేకర్‌ను కేరళకు కేంద్రప్రభుత్వం బదిలీ చేసింది.
మొత్తం మీద బలమైన రాష్ట్రాలకు గవర్నర్లను బదులాయింపు చేసినట్లు తెలుస్తోంది.
                                                                    



