రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ కల్కి సినిమా. గురువారం ఉదయం భారతదేశమంతటా సినిమా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఓపెనింగ్ కి సంబంధించిన టికెట్లు అన్నీ అమ్ముడైపోయాయి. ముఖ్యంగా యువతలో ఈ సినిమా పెద్ద చర్చనీయాంశం గా అయిపోయింది.
ఇప్పటికే కల్కి సినిమా రికార్డులు తిరగ రాస్తోంది.
ఇటీవల కాలంలో హీరో ప్రభాస్ పాన్ ఇండియా కథానాయకుడుగా మారిపోయారు. ఆయన్ని నమ్ముకుని సినిమా చేస్తే నిర్మాత పండగ చేసుకోవచ్చు. ఇప్పటికే ఓపెనింగ్ డేస్ కి టికెట్లు పూర్తిగా బుక్ అయిపోయాయి. కల్కి తెలుగు వర్షన్ నే 2, 500 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. 3, 500 స్క్రీన్ ల మీద విడుదల చేస్తున్నారు. అయినప్పటికీ అన్నిచోట్ల ఓపెనింగ్ డేస్ లో టికెట్లు ఇప్పటికే అమ్ముడుపోయాయి. భారతదేశం అంతటా కలుపుకుంటే సుమారు నాలుగు లక్షల టికెట్లు ఇప్పటికే అమ్మేసారని చెబుతున్నారు. ఒకరకంగా ఇది ఒక రికార్డ్ అని చెప్పుకోవాలి. ఇప్పటిదాకా ఏ సినిమాకి ఇంతటి క్రేజ్ ఏర్పడలేదు.
నిజానికి ఇప్పుడు పాన్ ఇండియా మూవీ అంటే … వెయ్యి కోట్ల రూపాయల టార్గెట్ పెట్టుకొని దిగుతున్నారు. కల్కి సినిమా కి అదే లక్ష్యం పెట్టుకుని బిజినెస్ చేస్తున్నారు. ఈ సినిమా నిర్మాణానికి సుమారు 500 కోట్ల దాకా ఖర్చు అయిందని చెప్తున్నారు. భీభత్సమైన లాభాలు సంపాదించాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఆ టార్గెట్ ని రీచ్ కావాలి అంటే మొదటి రోజు ఓపెనింగ్ కలెక్షన్ అదిరిపోవాలి. ఇటీవల కాలంలో పెద్ద సినిమాలుకు మొదటి రోజే వంద కోట్లు దాటిపోతున్నాయి. చాలా వరకు ప్రభాస్ సినిమాలకు మొదటి రోజు వంద కోట్లు వచ్చేసాయి. కానీ ఈ సినిమాకు 200 కోట్లకు పైగా సంపాదించాలని లెక్కలు వేస్తున్నారు. ఇప్పటిదాకా రాజమౌళి తీసిన ట్రిపుల్ ఆర్ సినిమా పేరుతో ఒక రికార్డు ఉంది .మొదటి రోజు 223 కోట్లు సంపాదించినట్లు చెబుతున్నారు. కల్కి సినిమాతో ఆ రికార్డును బద్దలు కొడతారా లేదా దగ్గరికి వెళ్తారా అన్నది కూడా చూడాలి.
ఇక సినిమా విషయానికి వచ్చినట్లయితే ఎన్నెన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి. పాన్ ఇండియా హీరో ప్రభాస్ మొత్తం శక్తిని కేంద్రీకరించి తీస్తున్న సినిమా ఇది. పైగా ఇద్దరు దిగ్గజాలు వంటి
హీరోలు .. అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్.. ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. దీపికా పదుకొనే కీలకమైన పాత్రలో నిలుస్తున్నారు. భారత్లోని అగ్రశ్రేణి టెక్నీషియన్లను ఈ సినిమా కోసం పిలిపించారు. ఈ సినిమా కోసం కళ్ళు చెదిరిపోయి సెట్ల ను నిర్మించారు . 25 మంది అగ్రశ్రేణి నటీనటులు తెరమీద ప్రతిభని ప్రదర్శిస్తారు. వందల మంది చిన్న నటులు తెర ఏరా అంతటా పరుచుకుని కనువిందు చేస్తారు.
మొత్తం మీద కల్కి సినిమా పూర్తి రిపోర్టు రావాలి అంటే గురువారం ఉదయం దాకా ఆగాల్సిందే