తెలుగు సినిమాల్లో ఇటీవల కాలంలో బాగా సంచలనం సృష్టించిన సినిమా కల్కి . వైజయంతి మూవీస్ తెలివిగా ఈ సినిమాకు మొదటి నుంచి హైపు క్రియేట్ చేస్తూ వచ్చింది. దీంతో ఈ సినిమా బిజినెస్ పరంగా తారాజువ్వనా ఎగురుతూ వెళ్ళిపోయింది.
నిజానికి కల్కి సినిమా మీద కథనం మీద కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ నటనపరంగా ప్రభాస్ అమితాబ్ కమలహాసన్ పోటీపడి నటించారు. అటు టెక్నికల్ వాల్యూస్ లో కూడా సినిమాకు మంచి మార్కులే పడుతున్నాయి. కానీ ఈ సినిమాతో ప్రభాస్ రేంజ్ ఎక్కడకో వెళ్ళిపోతుందన్న అభిమానుల ఆశలు… అక్కడే ఆగిపోయాయి. ప్రస్తుత సీజన్లో మాత్రం సూపర్ హిట్ సినిమాగా పేరు తెచ్చుకొంది . వివిధ భాషల్లో రిలీజ్ చేయడంతో పాన్ ఇండియా హిట్ అని ముద్ర వేయించుకుంది. నార్త్ అమెరికాలో కల్కి సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మూవీ ప్రీమియర్స్ తో కలుపుకొని ఐదు రోజుల్లోనే 11 మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేసింది.
ఇంత తక్కువ టైంలో ఈ స్థాయి కలెక్షన్స్ అంటే రికార్డ్ అని చెప్పాలి. రాజమౌళి బాహుబలి మూవీ లాంగ్ రన్ కలెక్షన్స్ ని కల్కి మూవీ ఐదు రోజుల్లోనే నార్త్ అమెరికాలో బ్రేక్ చేసింది.
ఆ విషయంలో కల్కి కి తగ్గకుండా ‘పుష్ప 2’..! ప్రభాస్ సలార్ మూవీ ఓవర్సీస్ లో 15.5 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ సాధించింది. ఆ నెంబర్ ని కూడా కల్కి 2898ఏడీ బ్రేక్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.
ఓవర్సీస్ లో హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న తెలుగు సినిమాగా బాహుబలి 2 ఉంది. ఈ మూవీ 20.77 మిలియన్ డాలర్స్ ని లాంగ్ రన్ లో కలెక్ట్ చేసింది. అయితే ఈ రికార్డ్ ని కల్కి బ్రేక్ చేస్తుందా లేదా అనేది చూడాలి. మరో వైపు వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 500+ కలెక్షన్స్ ని కల్కి మూవీ వసూళ్లు చేసిందని వైజయంతీ మూవీస్ అఫీషియల్ గా ప్రకటించింది. కేవలం నాలుగు రోజుల్లోనే 500+ కోట్లు కలెక్షన్స్ అందుకోవడం రేర్ ఫీట్ అని చెప్పొచ్చు. కలెక్షన్స్ పరంగా ఇదే జోరు కొనసాగితే 10 రోజుల్లో 1000+ కోట్లు కలెక్షన్స్ ని కల్కి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మూడు గంటలు నిడివి ఉన్న కూడా ప్రేక్షకులని కట్టిపడేసే విజువల్ ఎఫెక్ట్స్, బలమైన స్టోరీ నెరేషన్ కల్కి చిత్రంలో ఉంది.
చిన్న చిన్న అభ్యంతరాలు ఉన్న కూడా ప్రేక్షకులను వాటిని అస్సలు పట్టించుకోవడం లేదు.
సినిమాని, నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన ఫ్యూచర్ వరల్డ్ ని తెరపై చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఈ సినిమాకి మంచి ఆదరణ లభిస్తోంది.
మొత్తం మీద కలెక్షన్ల పరంగా కలిసి సినిమా సూపర్ హిట్ దక్కించుకుంది. వైజయంతి మూవీస్ తెలివిగా హైప్ క్రియేట్ చేయడంతో అన్ని మార్గాల్లో బిజినెస్ అద్భుతంగా జరిగిపోయింది దీంతో నిర్మాతలు హ్యాపీగా పండగ చేసుకుంటున్నారు.