నవరసనటనాసార్వభౌముడిగా తెలుగుసినీ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న కైకాల సత్యనారాయణ ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఉదయం హైదరాబాద్ ఫిలింనగర్లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. కృష్ణాజిల్లా కౌతవరంలో జన్మించిన కైకాల…సినీ వినీలాకాశంలో ఓ వెలుగు వెలిగారు. 777చిత్రాల్లో నటించి మెప్పించారు.నటనపరంగానే కాక ఉన్నతమైన వ్యక్తిత్వం ఆయనది.
కైకాల మరణంతో తెలుగు సినీపరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. చిరంజీవి సహా పలువురు ప్రముఖులు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. రేపు మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.