ఆదిలాబాద్ లోని బజార్హత్నూర్ మండలం గిర్నూర్ గ్రామ సమీపంలో కడెం నది ఎడమ కాల్వకు గండిపడింది. బలన్పూర్ వాగు వద్ద అసలైతే ఎప్పుడో గండి పడింది. పంటలు చేతికొచ్చే సమయం కావడంతో రబీ పంట కొరకు తాత్కాలిక మరమ్మతులు చేశారు. పూర్తి స్థాయి మరమ్మత్తుల కొరకు ఇదివరకే 40 లక్షలు మంజూరు అయ్యాయి. కానీ ఇంతవరకు పనులు మొదలుపెట్టలేదు. ఇకనైనా అధికారులు స్పందించి త్వరగా పనులు ప్రారంభించాలని స్థానిక రైతులు కోరుతున్నారు.








