తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై ఉజ్జల్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దాదాపు తొమ్మిది నెలల తర్వాత సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌కు వచ్చారు. ఇప్పటివరకు సీజేగా పనిచేసిన జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ ఢిల్లీకి బదిలీ అయిన విషయం తెలిసిందే. జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సీజేగా బాధ్యతలు స్వీక రిస్తే నాలుగేళ్ల కాలంలో ఈ పదవిని చేపట్టిన ఐదో వ్యక్తి అవుతారు.
ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తో పాటు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి నిరంజన్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. సీజే ప్రమాణ స్వీకారం నేపథ్యంలో రాజ్‌భవన్‌లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.