వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో వీడియో సర్వేకు ఆదేశాలిచ్చిన జడ్జి రవికుమార్ దివాకర్‌కు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా ఆయనింటికి వచ్చిన లేఖ కలకలం రేపుతోంది. ఇస్లామిక్ ఆగజ్ మూవ్మెంట్ నుంచి కాషిఫ్ అహ్మద్ సిద్ధిఖ్ అనే వ్యక్తి పేరుతో తనకు బెదరింపు లేఖ వచ్చినట్టు ఆయన తెలిపారు. ఈ వివరాలతో హోంశాఖ అడిషన్ చీఫ్ సెక్రటరీ , డీజీపీ, వారణాసి పోలీస్ కమిషన్‌కు న్యాయమూర్తి లేఖ రాశారు.
రిజిస్ట్రర్ పోస్టు ద్వారా దివాకర్‌కు బెదరింపు లేఖ వచ్చింది. జ్ఞానవాపి మసీదు సర్వే ప్రక్రియ సాధారణమే అని మీరన్నారు..ఒక కాఫిర్ నుంచి సరైన నిర్ణయం వస్తుందని ఏ ముస్లిం కూడా అనుకోడు” అని ఆయనకు వచ్చిన లేఖలో ఉంది. కాగా, జడ్జి దివాకర్‌కు బెదిరింపు లేఖ వచ్చిన విషయాన్ని ధ్రువీకరించిన వారణాసి కమిషనర్ సతీష్ గణేష్ దర్యాప్తు జరుపుతున్నట్టు చెప్పారు. 9 మంది పోలీసు సిబ్బందితో జడ్జికి భద్రత కల్పించామన్నారు.