ఎయిరిండియా తిరిగి తమకే సొంతం అవడంపై చైర్మన్ రతన్ టాటా హర్షం వ్యక్తం చేశారు. ‘ఎయిర్ ఇండియాకు తిరిగి స్వాగతం’ అంటూ ట్వీట్ చేశారు. కంపెనీ మాజీ చైర్మన్ జేఆర్డీ టాటా ఎయిరిండియా విమానం నుంచి దిగుతున్న ఫొటోను జతచేశారు.
ఎయిరిండియాను టాటాగ్రూప్ గెలుచుకోవడం గొప్పవిషయం. ఈ పరిణామంతో విమానయాన పరిశ్రమలో టాటా గ్రూప్ నకు మెరుగైన అవకాశాలు వస్తాయనుకుంటున్నామని ఆయన అన్నారు. ఎయిరిండియాకు పూర్వ వైభవం తెస్తామని, ఈ సందర్భంగా జేఆర్డీ టాటా ఉంటే ఎంతో ఆనందపడేవారని అన్నారు. వెల్ కమ్ బ్యాగ్ ఎయిరిండియా, భారతప్రభుత్వానికి కృతజ్ఞతలని రతన్ టాటా ట్వీట్ చేశారు..