ముంబైకి చెందిన 12ఏళ్ల జియా రాయ్ అరుదైన రికార్డు సాధించింది. శ్రీలంకలోని తలైమన్నార్ నుంచి తమిళనాడులోని ధనుష్కోడిలోని అరిచల్మునై వరకు 28.5 కి.మీ దూరం ఈదింది. 13 గంటల్లో గమ్యం చేరిన ఘనత సాధించింది.
శ్రీలంక, భారత అధికారుల నుంచి అనుమతి తీసుకున్న జియారాయ్…. మార్చి 20న ఆదివారం ఉదయం 4.22 గంటలకు తన ప్రయాణాన్ని ప్రారంభించింది.. నిరాటంకంగా ఈదుకుంటూ వెళ్లి సాయంత్రం 5.32 గంటలకు అరిచల్మునై చేరుకుంది.
ఇంతటి ఘనత సాధించిన జియాను, ఆమెను కన్న మధన్ రాయ్, రెజీనా రాయ్‌ను అభినందించారు తమిళనాడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శైలేంద్ర బాబు .
సముద్రంలో ఎన్నో జీవరాశులుంటాయి.వాటిలో విషపూరితమైనవీ, ప్రమాదకరమైనవీ ఉంటాయి. పాములు, సొరచేపల తోపాటు జెల్లీ ఫిష్‌లతో నిండి ఉన్న నీటిలో ప్రవాహానికి ఎదురెళ్తూ గమ్యస్థానం చేరిన జియా సాహసాన్ని దేశమంతా అభినందిస్తోంది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)