గత నెలలో పాలక్కాడ్‌లో ఆర్ఎస్ఎస్ కార్యకర్త శ్రీనివాసన్ హత్యకేసులో కేరళ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ లో పని చేసే జీషాద్ ను అరెస్టు చేశారు. పోలీసులు నాలుగు రోజులు అతన్ని ప్రశ్నించారు. జిషాద్ అరెస్టు చేసినట్లు పాలక్కాడ్ పోలీసులు ధృవీకరించారు. ఏప్రిల్ 16న పాలక్కాడ్ టౌన్‌లోని తన దుకాణంలో శ్రీనివాసన్‌ను హతమార్చడానికి జరిగిన కుట్రలో జిషాద్ పాల్గొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసులో నిందితులకు జిషాద్ వివిధ సందర్భాల్లో సాయం చేశాడని దర్యాప్తు అధికారులు తెలిపారు. గతేడాది నవంబర్ 15న జిల్లాలోని కినాస్సేరిలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త సంజిత్ హత్య కేసులో అరెస్టయిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) సభ్యులతో కూడా అతనికి సంబంధాలున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి జిషాద్ది 22వ అరెస్టు. ఇది పాలక్కాడ్ జిల్లాలో జరిగిన రాజకీయ హత్యలలో రెండోది. శ్రీనివాసన్ హత్యకు ఒక రోజు ముందు, జిల్లాలోని ఎలాపుల్లి వద్ద స్థానిక PFI కార్యకర్త సుబైర్ను నరికి చంపారు.
ఈ కేసులో ఇంకెవరైనా ఉన్నారేమో అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నామని పాలక్కాడ్ జిల్లా పోలీస్ అధికారి ఆర్. విశ్వనాద్ తెలిపారు.