మహారాష్ట్రలో అల్లర్లు యవత్మాల్ జిల్లాకు పాకాయి. ఉమర్ ఖేఢ్ లో హిందువులు లక్ష్యంగా జిహాదీ గ్రూపులు రెచ్చిపోయాయి. సోషల్ మీడియాలో మహ్మద్ ప్రవక్త పట్ల అనుచిత పోస్టు పెట్టారని వారంతా పట్టణంలో బీభత్సం సృష్టించారు. వందలాదిమంది ఒక్కసారిగా బయటకు వచ్చి హిందువుల దుకాణాలను నిప్పుపెట్టారు. ధ్వంసం చేశారు. హిందువులకు చెందిన అనేక వాహనాల్ని తగులపెట్టారు. పలువురి ప్రైవేట్ ఆస్తుల్ని మంటల్లో వేశారు.
అంతకుముందు ప్రవక్తను అవమానించిన వారిని అరెస్ట్ చేయాలంటూ అంతా ఉమర్ ఖేడ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు.
నిందితుడిని తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ స్టేషన్ ను ముట్టడించారు.సైబర్ క్రైం డిపార్ట్ మెంట్ వాళ్లకి వివరాలు ఇచ్చామని…త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని రెండు రోజులు ఓపిక పట్టాలని పోలీసులు నచ్చజెప్పినా వినలేదు. చివరికి పోలీసు ఉన్నతాధికారులు సర్దిచెప్పాల్సి వచ్చింది. స్టేషన్ నుంచి బయటికి వచ్చిన వారంతా ఎవరి ఇళ్లకు వారు వెళ్తారని అనుకున్నారు. కానీ దాదాపు రెండు వందల మంది అక్కడే ఉన్న హిందువుల దుకాణాల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు మొదలుపెట్టారు. నాగ్ చౌక్ లోని ఓ ఆటోమొబైల్ స్పేర్ షాప్ పూర్తిగా దగ్ధం అయింది. వందలాది దుకాణాల్లోకి చొరబడి నగదు దోచుకెళ్లారు. రాత్రి ఎనిమిదిన్నర తరువాత ఈ అల్లర్లు జరిగినట్టు తెలుస్తోంది. అక్కడి దుకాణదారులకు చెందిన వాహనాలను పూర్తిగా ధ్వంసం చేశారు.
తమపై దాడులను నిరసిస్తూ శనివారం ఉమర్ ఖేడ్ లోని మార్కెట్లు బంద్ నిర్వహించాయి. తమపై దాడికి తెగబడి ఆస్తులు ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వ్యాపారుల సంఘం డిమాండ్ చేసింది. దీంతో పోలీసులు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. .
అల్లరిమూక స్వేచ్ఛగా బయటే తిరుగుతోందని అసలైన దోషుల పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కోలేదనీ స్థానికులు ఆరోపిస్తున్నారు. ఓ వీడియో వాట్సప్ గ్రూపుల్లో తిరిగింది తప్ప…ఎవరూ ఇన్ స్టాలో షేర్ చేయలేదని…పోలీసులు ఒత్తిడికి లొంగి కేసులు తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడుతున్నారు.
మహ్మద్ ప్రవక్తను అవమానిస్తున్నట్టు ఉన్న పోస్టు సోషల్మీడియాలో వైరల్ అవుతోందని కొన్ని మరాఠీ చానళ్లూ ప్రసారం చేశాయి. ఈ ఏడాది ఏప్రిల్లో ఉత్తరప్రదేశ్లోని బరేలీలో శుక్రవారం ప్రార్థనల అనంతరం ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించి “గుస్తాఖ్-ఈ-రసూల్ కీ ఏక్ హి సాజా, సార్ తాన్ సే జుడా, సార్ తాన్ సే జుడా” అంటూ నినాదాలు చేశారు.
దైవ దూషణ చేశాడంటూ డిసెంబర్ 3న పాకిస్తాన్ సియాల్ కోట్ లో ఓ గుంపు శ్రీలంక జాతీయుడిని సజీవదహనం చేసింది. అప్పుడూ -ఇ-రసూల్ కి ఏక్ హి సాజా, సార్ తాన్ సే జుడా, సార్ తాన్ సే జుడా” అనే నినాదం వినిపించారు.
https://twitter.com/MVAGovt/status/1472114012137480195?s=20