ఝార్ఖండ్ లో కాంగ్రెస్ పార్టీ కి ఒక వైపు విచారం, మరో వైపు ఆనందం కలుగుతోంది. అక్కడ పోటీ చేసిన సగానికి పైగా సీట్లలో కాంగ్రెస్ ఓడిపోయింది. 31 సీట్లకు పోటీ చేసి 16 స్థానాల్లో మాత్రమే గెలుపు సాధించింది.
కానీ కాంగ్రెస్ పార్టీ భాగస్వామి ఝార్ఖండ్ ముక్తి మోర్చా బలమైన విజయం సాధించింది. 43 స్థానాల్లో పోటీ చేసి, 33 స్థానాల్లో విజయం సాధించింది. హేమంత్ సొరేన్, కల్పన సొరేన్ జంట అద్భుతమైన సత్తా చాటింది.
ఝార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీ కూటమి కి నిరాశ ఎదురైంది. ఇక్కడ మరో విషయం కూడా గమనించాలి. ఝార్ఖండ్ లో 81 సీట్లు కి గాను,, సుమారు 40 సీట్లు ఎస్సీ, ఎస్టీ లకు రిజర్వ్ చేసిన స్థానాలు. ఈ సీట్లన్నింటిలోనూ బీజేపీ కూటమి ఓటమి చవి చూసింది. క్రైస్తవ మిషనరీలు విస్తారంగా నెగిటివ్ ప్రచారం చేయటం బీజేపీ ని నష్ట పరిచింది.