మహారాష్ట్ర ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జన సేనాని పవన్ ప్రభంజనం చూపించారు. ఆయన ప్రచారం నిర్వహించిన దాదాపు అన్నిచోట్లా.. బీజేపీ క్యాండిడేట్స్ గెలుపు సాధించారు. ఏపీలో ప్రభుత్వ మార్పిడిలో కీలక పాత్ర పోషించిన జనసేనాని.. ఛత్రపతి శివాజీ ఏలిన నేలపైనా ప్రచారం నిర్వహించి.. మరాఠా గేమ్ ను మలుపుతిప్పారు.
ఇప్పుడు దేశ వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పేరు మార్మోగిపోతోంది. ఈ ఎన్నికల్లో తెలుగువారి ఓట్లు కీలకంగా మారడంతో.. తెలంగాణ, ఆంధ్ర నుంచి చరిష్మా ఉన్న లీడర్లతో ఆయా కూటములు ప్రచారం చేయించాయి. ముఖ్యంగా ఏపీ నుంచి డిప్యూటీ సీఎం, జనసేనాని పలుచోట్ల ప్రచారం చేపట్టారు. పూణే, బల్లార్ పూర్, షోలాపూర్, డెగ్లూర్, లాతూర్, హదప్సర్, కస్బా పేత్ నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ ప్రచారం నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల్లో ఏకంగా కోటి మందికి పైగా తెలుగు ఓటర్లుండటంతో.. పవన్ మేనియా సరిగ్గా ఉపయోగించుకుంది. తిరుమల లడ్డూ వివాదం.. ఆ తర్వాత సనాతన పరిరక్షణ బోర్డ్ ఏర్పాటుతో.. హిందువులకు సరికొత్త ఐకాన్ గా మారిన పవన్ కల్యాణ్.. తన చరిష్మా ఎంతలా పనిచేసిందో.. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. ఇక నుంచి దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా.. ఎన్డీయే పక్షాన పవన్ కల్యాణ్ ప్రచారం నిర్వహిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక నుంచి ఎన్డీయేలో ముఖ్యంగా మోడీకి నమ్మదగిన పార్టీ నేతల్లో పవన్ కల్యాణ్ చేరిపోయారు. అందుకే ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. జనసేనానిపై ప్రశంసలు కురిపిస్తూ.. పవన్ కాదు.. తుఫాన్ అని మోడీ పొగడ్తలతో ముంచెత్తారు.
మొత్తం మీద ఎన్డీఏ కూటమి కి పవన్ కళ్యాణ్ ను దళపతి గా అభివర్ణిస్తున్నారు.