స్వాతంత్య్రం వచ్చిన 14 ఏళ్లకు పైగా పరాయి పాలనలోనే మగ్గిన గోవాను భారత దేశంలో విలీనం చేసే విషయంలో కేంద్రం లోని జవహర్ లాల్ నెహ్రు ప్రభుత్వం మీనమేషాలు లెక్కపెడుతూ ఉంటె, పోలీస్ చర్య అవసరమని ప్రతిపక్షాలు స్పష్టం చేస్తున్నా వెనుకడుగు వేస్తుంటే, గోవా విమోచన కోసం సత్యాగ్రహ ఉద్యమం ప్రారంభించి, నెహ్రు ప్రభుత్వంపై వత్తిడి తీసుకు రావడంలో భారతీయ జనసంఘ్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లు నిర్ణయాత్మక పాత్ర వహించాయి.
జూన్ 13, 1955న, కర్ణాటకకు చెందిన సీనియర్ భారతీయ జనసంఘ్ నాయకుడు జగన్నాథరావు జోషి మహిళలతో సహా సుమారు 3,000 మంది ఆర్ఎస్ఎస్ స్వయంసేవక్ లతో కలసి గోవా సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. ఆయన గోవా సరిహద్దుకు చేరుకున్నప్పుడు, పోర్చుగీస్ పోలీసులు సత్యాగ్రహిలపై లాఠీచార్జ్, కాల్పులు జరిపారు. జైలులో ఆయన ఆరోగ్యం కూడా క్షీణించింది. అప్పటి నుండి ఆయన `కర్ణాటక కేసరి’గా పేరొందారు.
ఆగష్టు 15, 1955న, గోవాలో మోహరించిన పోర్చుగీసు సైన్యం 5,000 మందికి పైగా సత్యాగ్రహిలపై కాల్పులు జరిపి, దాదాపు 51 మందిని చంపింది. ఇలాంటి అనేక ఉద్యమాలు 1961 వరకు కొనసాగాయి. ప్రముఖ సంగీత విధ్వంసుడు సుధీర్ ఫడ్కే ‘బాబుజీ’ గోవా ఉద్యమానికి సాంస్కృతిక రంగంలో సహకారం అందించారు.
సరస్వతి ఆప్టే ‘తాయ్’ నేతృత్వంలోని గోవా విమోచన ఉద్యమంలో రాష్ట్ర సేవిక సమితి కూడా పాల్గొంది. పూణేలో గుమిగూడిన అన్ని సత్యాగ్రహి సమూహాలకు ఆహారం మొదలైనవి ఏర్పాటు చేసింది. జన్ సంఘ్‌లోని సత్యాగ్రహీల సంఖ్య అన్ని ఇతర పార్టీల ఉమ్మడి నిరసనకారుల కంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది.
ముంబైలో ఏర్పడిన యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ గోవాన్స్ (యు ఎఫ్ జి) దాదర్ ను, నగర్ హవేలీ ని వినాయక్ రావ్ ఆప్టే నేతృత్వంలోని 40-50 మంది సంఘ్ స్వయంసేవక్ లతో పాటు , ప్రభాకర్ విఠల్ సెనారి, ప్రభాకర్ వైద్య నేతృత్వంలోని ఆజాద్ గోమంతక్ దళ్‌కు చెందిన డామన్ , గోవా కార్యకర్తలతో కలిసి విముక్తి సాధించారు.
ప్రధాని నెహ్రూ దౌత్యపరమైన పరిష్కారం కోసం చూస్తున్న సమయంలో గోవాను విముక్తి చేయాలనే ఒత్తిడి పెరిగింది. ఆ సమయంలో పోర్చుగల్ నాటోలో సభ్యదేశంగా ఉన్నందున, కాశ్మీర్ సమస్య కూడా వివాదాస్పదంగా ఉన్నందున, అటువంటి పరిస్థితిలో, భారత్ సైనిక చర్యకు దిగడం సరికాదని ఆయనభావించారు.
అయితే, ప్రధాని నెహ్రూ దౌత్య మార్గాన్ని తిరస్కరిస్తూ 1955లో గోవా విముక్తి కోసం ఉద్యమం ప్రారంభమైంది. ఉద్యమం ప్రారంభ రోజుల్లో, రాజా భాయ్ మహాకల్ బుల్లెట్ గాయాలతో మరణించాడు. ఈ విషాద సంఘటన తర్వాత, ఆందోళనకారులకు సహాయం చేయాలని ప్రజలు భారత్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు, అయితే వారి పట్ల సానుకూల దృక్పథాన్ని అనుసరించడానికి విరుద్ధంగా, ఉద్యమకారులను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సత్యాగ్రహులపై దౌర్జన్యాలు
పోర్చుగీస్ పరిపాలన దౌర్జన్యాల కారణంగా అఖిల భారత జనసంఘ్ కార్యదర్శి, ‘కర్ణాటక కేసరి’ జగన్నాథరావు జోషి, మహారాష్ట్ర జనసంఘ్ ఉపాధ్యక్షుడు అన్నా సాహెబ్ కావడిల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. పైగా, జగన్నాథరావు జోషి నేతృత్వంలోని జనసంఘ్ గ్రూపులోని ఇద్దరు సత్యాగ్రహులు భయంకరమైన హింసల ఫలితంగా మరణించారు, వారిలో ఒకరు మధురకు చెందిన అమీర్‌చంద్ గుప్తా.
ఆగష్టు 15, 1955న, భారతదేశం అంతటా 9వ స్వాతంత్య్ర వార్షికోత్సవం జరుపుకుంటున్నప్పుడు, అఖండ భారత్ ప్రియమైన, ధైర్య దేశభక్తుల పుత్రులు అనాగరికమైన పోర్చుగీసు వారి తుపాకీలను ఎదుర్కొంటూ ముందుకు సాగారు. భీకర రీతిలో జరిపిన కాల్పులలో ఏకంగా 51 మంది వీర వీరులు ప్రాణత్యాగం చేశారు. గాయపడిన వారి సంఖ్య దాదాపు 300కి చేరుకుంది.
ఒక చిన్న ప్రాంతంలో, ఒక రోజులో ఇంత పెద్ద సంఖ్యలో నిరాయుధులు మరణించడం ప్రపంచ చరిత్రలోనే అరుదని చెప్పవచ్చు. 40 ఏళ్ల సుభద్ర బాయి ధైర్యం ఝాన్సీ రాణిని గుర్తు చేసింది. ఆమె మగ సత్యాగ్రహి నుండి జెండాను తీసుకొని తన ఛాతీపై బుల్లెట్ తీసుకొని అద్భుతమైన ఉదాహరణను అందించింది.
ఢిల్లీలోని రాజేంద్ర నగర్లో జనసంఘ్ ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభలో త్యాగధనులకు నివాళులు అర్పిస్తూ పోలీసు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. సభను ఉద్దేశించి జనసంఘ్ ప్రధాన కార్యదర్శి దీనదయాళ్ ఉపాధ్యాయ మాట్లాడుతూ.. అనాగరిక దౌర్జన్యాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ గోవాలో ఆందోళనకు దిగుతున్న భారతీయులను పోర్చుగీస్ పాలన ఆపాలని కోరుకుంటోందని, అయితే భారత ప్రజలు భయపడరని హెచ్చరించారు.
పోర్చుగీస్ దురాగతాలకు ఏమాత్రం తలొగ్గమని స్పష్టం చేస్తూ పెద్ద సంఖ్యలో సత్యాగ్రహులను పంపడం ద్వారా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని ప్రకటించారు. పైగా, పోర్చుగీస్ ప్రభుత్వం ప్రకటించిన కొన్ని సంస్కరణలను తిరస్కరిస్తూ విముక్తి కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
నెహ్రు ప్రభుత్వంకు గురూజీ హితవు
గోవాలో పోలీస్ చర్య తీసుకొని, గోవును విముక్తి చేయడానికి ఇంతకంటే మంచి అవకాశం మరొకటి ఉండదని అంటూ ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలకే మాధవరావు సదాశివరావు గోల్వాల్కర్ (గురూజీ) నెహ్రు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పైగా అటువంటి చర్య అంతర్జాతీయంగా మన ప్రతిష్టను పెంచుతుందని, మన చుట్టూ ఉన్న, మనలను ఎల్లప్పుడూ బెదిరిస్తున్న దేశాలకు పాఠాలు అందిస్తుందని హితవు చెప్పారు.
“గోవా విముక్తి ఉద్యమానికి మద్దతు ఇవ్వబోమని ప్రకటించి విమోచన ఉద్యమానికి భారత ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది.భారత పౌరులపై జరుగుతున్న ఈ అమానవీయ కాల్పులపై భారత్ ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా మాతృభూమికి విముక్తి కల్పించేలా చర్యలు తీసుకోవాలి. విదేశీయుల బానిసత్వంలో కొట్టుమిట్టాడుతున్నారు.” అంటూ గురూజీ ఒక ప్రకటన విడుదల చేశారు.
గోవా సత్యాగ్రహంలో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొంటుండగా, కాంగ్రెస్ మాత్రం దూరంగా ఉండిపోయింది. పైగా, జులై 23, 1955న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమై గోవా ప్రజలు మాత్రమే ఉద్యమంలో పాల్గొనాలని, భారత దేశ ప్రజలు సత్యాగ్రహంలో పాల్గొనరాదని అంటూ తీర్మానం చేయడం ద్వారా, విముక్తి పోరాటానికి ద్రోహం చేసే ప్రయత్నం చేసింది.
కాంగ్రెస్ ధోరణిని ఎండగట్టిన జనసంఘ్ గోవా భారత్ లో అంతర్భాగమే అని స్పష్టం చేసింది. దేశ స్వతంత్ర పోరాటంలో గోవా ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని గుర్తు చేసింది. కమ్యూనిస్ట్ పార్టీ గోవాలో పోలీస్ చర్యకు డిమాండ్ చేసినా కాంగ్రెస్ తీర్మానాన్ని బలపరించింది. అశోక్ మెహతా, సుచేత కృపాలిని వంటి వారు కాంగ్రెస్ లో చేరారు.
ప్రతిపక్షాలకు జనసంఘ్ లేఖలు
జనసంఘ్ అధ్యక్షుడు ప్రేమనాథ్ డోంగ్రే సత్యాగ్రహంలో పాల్గొనాలని కోరుతూ అన్ని పార్టీలకు పలు లేఖలు వ్రాసారు. అయితే గోవా విముక్తిలో బిజెపితో చేరడానికి చాలా పార్టీలు విముఖత వ్యక్తం చేశాయి. అఖిల పార్టీ కమిటీ ఏర్పాటు చేయమని జనసంఘ్ డిమాండ్ చేసింది. ప్రజల మనోభావాలు గ్రహించిన ప్రధాని నెహ్రు ఆగష్టు 8, 1955 నుండి భారత్ లో పోర్చుగీస్ రాయబార కార్యాలయంను మూసి వేస్తున్నట్లు ప్రకటించారు.
గోవా విముక్తికి పోలీస్ చర్య గాని లేదా సత్యాగ్రహమే మార్గమని జనసంఘ్ స్పష్టం చేయగా, ఆ రెండింటికి నెహ్రు సిద్ధంగా లేరు. అంతర్జాతీయ వత్తిడులతో సమస్య పరిష్కరించాలని నెహ్రు చేసిన ప్రయత్నం వృధా ప్రయాస అని జనసంఘ్ స్పష్టం చేసింది.
చివరకు, డిసెంబర్ 19, 1961న గోవా, డామన్, డయ్యూలో భారత సైన్యం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. 36 గంటల పాటు సాగిన దీనికి `ఆపరేషన్ విజయ్’ అని పేరు పెట్టారు. పోర్చుగల్ గవర్నర్ జనరల్ వాసలో ఇ.సిల్వా భారత ఆర్మీ చీఫ్ పీఎన్ థాపర్ ఎదుట లొంగిపోయారు. ఆ విధంగా జన్ సంఘ్, ఆర్ఎస్ఎస్, భారత సైన్యం ద్వారా గోవా భారత రిపబ్లిక్ లో భాగమైంది.
మే 30, 1987న గోవాకు రాష్ట్ర హోదా లభించింది. డామన్, డయ్యూ కేంద్రపాలిత ప్రాంతాలుగా మిగిలిపోయాయి. డిసెంబర్ 19న గోవా విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము.
Courtesy :- Nijam Today