జమ్ముకశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టాయి భద్రతాబలగాలు. కుప్వారాలోని చకత్రాస్ లో సమీపంలో జరిగిన ఎన్ కౌంటర్లో ఇద్దరు హతమైనట్టు అధికారులు ప్రకటించారు. ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో తిరుగుతున్నారన్న నిఘావర్గాల సమాచారంలో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఒకచోట నక్కిన వారిని చుట్టుముట్టాయి. తరువాత జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులు మృతి చెందారు.వారిలో ఓ ఉగ్రవాదిని పాకిస్తాన్ కు చెందిన తౌఫిల్ గా గుర్తించారు. నిఘావర్గాలు ఇచ్చిన సమాచారంతో 22 రాష్ట్రీయ రైఫిల్స్, 9 పారా కమెండోలు, సీఆర్పీఎఫ్, జమ్మూకశ్మీర్ స్పెషల్ ఆపరేషన్ బృందాలు ఈ ఎన్ కౌంటర్లో పాల్గొన్నాయి.
https://twitter.com/KashmirPolice/status/1533975776525025285?s=20&t=IPLbaemmkFtrCMqrxjuB9g