ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సంస్కరణల దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. జమిలీ ఎన్నికల ను సాకారం చేసేందుకు మూడు బిల్లులను తీసుకొని వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’కు సంబంధించి ఉన్నత స్థాయి కమిటీ చేసిన సిఫార్సులను ఆమోదించింది. ప్రతిపాదిత మొదటి రాజ్యాంగ సవరణ బిల్లు- లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా నిబంధనలను రూపొందించడం. ఈ బిల్లుకు కనీసం 50 రాష్ట్రాలు ఆమోదించాల్సిన అవసరం లేదని సిఫారసులు పేర్కొన్నాయి.
ఈ బిల్లుల వివరాలు చూద్దాం.
ఆర్టికల్ 83(2) సవరించడం.
లోక్‌సభ వ్యవధి, దాని రద్దుకు సంబంధించిన కొత్త సబ్-క్లాజ్లు(2), (4)ని చేర్చడం
శాసనసభలను రద్దు చేయడం, ‘ఏకకాల ఎన్నికలు’ అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చడానికి ఆర్టికల్ 327 సవరించడం
రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించిన మార్పులు, సవరణ నిబంధనలు ఉన్నరెండో బిల్లును కనీసం 50శాతం రాష్ట్రాలు ఆమోదించాల్సిన అవసరం ఉంది.
స్థానిక సంస్థల ఎన్నికల కోసం, రాష్ట్ర ఎన్నికల కమిషన్లతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్టోరల్ రోల్ తయడానికి సంబంధించి రాజ్యాంగ నిబంధనలు సవరించడం
లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా, కొత్తగా ఆర్టికల్ 342ఏ చేర్చడం.
మూడో బిల్లు సాధారణ సవరణ బిల్లు. ఇందులో, లెజిస్లేటివ్ అసెంబ్లీలు ఉన్న దిల్లీ, పుదుచ్చేరి, జమ్ముకశ్మీర్, దిల్లీ వంటి కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన చట్టాల్లో సవరణలు చేసే నిబంధనలను ఉంటాయి. ఈ యూటీ అసెంబ్లీల నిబంధనలను, మొదటి రాజ్యాంగ సవరణ బిల్లులో ప్రతిపాదించిన- రాష్ట్రాల్లో శాసనసభలు, లోక్‌సభ నిబంధనలతో సరచేయడానికి ఈ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు ప్రతిపాదించిన సవరణలు ఇవే
సంస్కరణలను అమలు చేసే దిశలో అడుగులు వేస్తున్నారు.
గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ దిల్లీ, 1991 చట్టాన్ని సవరించడం
గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ యాక్ట్-1963ని సవరించడం
జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2019ని సవరించడం
జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ మొత్తం 18 సవరణలు సిఫారసు చేసింది. అందులో ప్రస్తుతం ఉన్న ఆర్టికల్లలో 12 కొత్త సబ్ క్లాజ్‌లను చేర్చడం. అసెంబ్లీలు ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన మూడు చట్టాలను సర్దుబాటు చేయడం ఉన్నాయి.
జమిలి ఎన్నికలు సాకారం చేయడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు సాధ్యమవుతాయి.