యూనిఫాం సివిల్ కోడ్ (UCC)కి వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించింది ఇస్లామిక్ సంస్థ జమియత్-ఉలమా-ఏ-హింద్.
ఇది ముస్లిం పౌర విషయాలలో ఏకరూపతను అమలు చేయడానికి ప్రయత్నిస్తుందని పేర్కొంది. ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ జిల్లాలోని దేవబంద్లో 5,000 ముస్లిం సంస్థలు పాల్గొన్న 2 రోజుల కార్యక్రమంలో ఈ తీర్మానాన్ని ఆమోదించారు. UCC అమలులోకి రావడం వల్ల భారత రాజ్యాంగం ఇదివరకు హామీ ఇచ్చిన పర్సనల్ లా లను పాటించదాన్ని నిరోధించినట్టేనని తీర్మానం పేర్కొంది.
https://twitter.com/JamiatUlama_in/status/1530751400677847040?s=20&t=42iMaQhLG418hLTL3SbwGg
“ఇది రాజ్యాంగ స్ఫూర్తిని విస్మరిస్తుంది. ఇస్లామిక్ చట్టంలో జోక్యాన్ని ఏ ముస్లిం అంగీకరించడు. యూసీసీని అమలు చేయడం ద్వారా ఏ ప్రభుత్వమైనా తప్పు చేస్తే, ముస్లింలు ఆ అన్యాయాన్ని అంగీకరించరు. రాజ్యాంగ పరిమితుల్లో ఉంటూనే దానికి వ్యతిరేకంగా అన్ని చర్యలు తీసుకోవలసి వస్తుంది” అని హెచ్చరించారు.
మోదీ ప్రభుత్వం విద్వేషపూరితంగా వ్యవహరిస్తోందని.. భారతదేశంలో ముస్లింల జీవితాలను కష్టతరం చేస్తోందని జమియత్ ఉలమా-ఏ-హింద్ ఆరోపించింది. సమాజాన్ని ఏకం చేయడానికి.. ఇస్లామోఫోబియాను ఎదుర్కోవడానికి 1,000 ‘సద్భావనా సమావేశాలు’ (సద్భావనా సంసద్లు) నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
జమియత్-ఉలమా-ఏ-హింద్ అధ్యక్షుడు మౌలానా మదానీ మాట్లాడుతూ, “మేం పాకిస్తాన్కు వెళ్ళే అవకాశం ఉంది, కానీ మేం వెళ్ళలేదు. పాకిస్థాన్ పై మొగ్గు చూపే వారు స్వయంగా అక్కడికి వెళ్ళిపోవాలి. ఇక్కడి ముస్లింలు తమ దేశంలోనే అపరిచితులుగా ఉంటున్నారు. మేము ఓపికగా ఉన్నాం, అందుకని మేం తల వంచి ప్రతిదీ అంగీకరిస్తామని దాని అర్థం కాదు. మేం ప్రతి విషయంలోనూ రాజీ పడగలం, కానీ మా విశ్వాసం విషయానికి వస్తే ఎంత మాత్రం రాజీ పదము అని అన్నాడు.