అమెరికాలో భారతీయ ముస్లింల అతిపెద్ద న్యాయవాద సంస్థ అని చెప్పుకునే ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ (IAMC), హ్యూమన్ రైట్స్, రిలీజియస్ ఫ్రీడమ్ (HRRF) క్రింద ప్రైజ్ మనీ అవార్డు విజేతలుగా కొంతమంది భారతీయ జర్నలిస్టులను, మీడియా సంస్థలను పేర్కొంది. ఆ సంస్థ తన అధికారిక వెబ్సైట్లో అవార్డుల విజేతలకు ₹3 లక్షల విలువైన ప్రైజ్ మనీని ప్రకటించింది.
IAMC ఎంపిక చేసిన ‘జర్నలిస్టులు’: –
న్యూస్‌లాండ్రీకి చెందిన ఆకాంక్ష కుమార్,
ది న్యూస్ మినిట్‌కి చెందిన ప్రియాంక తిరుమూర్తి,
ది కారవాన్ మ్యాగజైన్‌కు చెందిన షాహిద్ తంత్రే
ది వైర్ కు చెందిన ఇస్మత్ అరా,
Scroll.in కు చెందిన ఐశ్వర్య S అయ్యర్
ది న్యూ ఇష్యూ మ్యాగజైన్ – UK సయ్యద్ షహ్రియార్.
పైన పేర్కొన్న జర్నలిస్టులతో పాటు ‘మూక్‌నాయక్’ అనే ఆన్లైన్ న్యూస్ పోర్టల్ ఆర్టికల్ 14 కూడా ప్రైజ్ మనీ విజేతలుగా పేర్కొన్నారు.
https://twitter.com/thehawkeyex/status/1538885085226672128?s=20&t=oUCsMt4xbpV8Gm_I6ykw3w
‘మత మార్పిడి నిరోధక చట్టాల కింద మతపరమైన మైనారిటీలను లక్ష్యంగా చేసుకోవడం, COVID-19 సమయంలో ముస్లింలను వేధించడం, కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనల సమాచారాన్ని కవర్ చేసిన ఈ అసాధారణమైన రిపోర్టింగ్ ఆదివారం జరిగిన వారి వర్చువల్ అవార్డు వేడుకలో బాగా హైలైట్ చేశారు. మరో విధంగా చెప్పాలి అంటే నిజాలతో సంబంధం లేకుండా వారి అజెండా ప్రకారం భారతదేశాన్ని విమర్శిస్తూ కించపరుస్తూ దేశ విదేశీ మీడియాలో రాస్తున్న వ్యాసాలు, వార్తలు రాసే వారికి ఈ IAMC అనే ముస్లిం సంస్థ బహిరంగంగా ప్రకటించిన బహుమతులు ఈ అవార్డ్స్. మరి ఈ వ్యాసాలు రాస్తున్నందుకు పరోక్షంగా ఎంత సొమ్ములు ముట్టచెపుతున్నారో ఊహించండి.
మీడియా కరస్పాండెంట్లు/కాలమిస్టులు, కార్టూనిస్టులు, సంపాదకులు సహా మీడియా సంస్థల యజమానులు విదేశీ సహకారం/ఆతిథ్యాన్ని స్వీకరించడం విదేశీ విరాళాల నియంత్రణ చట్టం, 2010 ప్రకారం నిషేధించబడింది.
చట్టంలోని సెక్షన్ 3(1) స్పష్టంగా ఏ వ్యక్తి, లేదా సంస్థ, సమూహం (కరస్పాండెంట్, కాలమిస్ట్, కార్టూనిస్ట్, ఎడిటర్, యజమాని ) ఎటువంటి విదేశీ సహకారాన్ని స్వీకరించకూడదని స్పష్టంగా పేర్కొంది.
IAMC అనేది పాకిస్తాన్ ఆధారిత టెర్రర్ గ్రూపులతో సంబంధాలు గల సంస్థ. ఇది అంతర్జాతీయ వేదికపై భారత వ్యతిరేక ప్రచారానికి ప్రసిద్ది చెందింది. భారతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా అమెరికా నాయకులు, సంస్థలతో లాబీలు చేస్తుంది.
యునైటెడ్ స్టేట్స్ కమీషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడం (USCIRF) ద్వారా భారతదేశాన్ని బ్లాక్ లిస్ట్‌లో చేర్చేందుకు US-ఆధారిత లాబీ సంస్థ అయిన ఫిడెలిస్ గవర్నమెంట్ రిలేషన్స్ (FGR) చెల్లించడానికి ఈ IAMC సంస్థ రోహింగ్యా ముస్లింల ప్రయోజనాల కోసం సేకరించిన నిధులను, ఉపయోగించినట్లు తెలిసింది.
టెర్రీ అలెన్, FGR కోసం చీఫ్ ఆఫ్ స్టాఫ్ USCIRF చైర్ అయిన నాడిన్ మెంజాకు దీర్ఘకాల సహచరుడు. IAMC షేక్ ఉబైద్ అబ్దుల్ మాలిక్ ముజాహిద్‌తో స్నేహం ఉంది. ఇతను ఇస్లామిక్ సర్కిల్ ఆఫ్ నార్త్ అమెరికా, పాకిస్తాన్ జమాత్-ఇ-ఇస్లామీ కోసం US ఫ్రంట్‌కి నాయకత్వం వహించాడు. లష్కరే తోయిబా సహా పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాద గ్రూపులతో కూడా IAMC కి సంబంధాలు ఉన్నాయి.
అంతకుముందు 27 జనవరి 2022న, కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ నిషేధిత ఇస్లామిస్ట్ సంస్థ స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (SIMI), పాకిస్తాన్ కు చెందిన ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) తో IAMCకి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో భారత వ్యతిరేకతను ప్రచారం చేసేందుకు IAMC ప్రయత్నిస్తోందని ఆయన పేర్కొన్నారు.
నవంబర్ 2021లో త్రిపురలో కాలిపోతున్నట్లు ఆరోపించబడిన మసీదు నకిలీ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు IAMC అధికారిక ఖాతా సహా 100 మందికి పైగా సోషల్ మీడియా ఖాతాదారులపై చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద బుక్ చేసారు. వీరు వ్యాప్తి చేసిన త్రిపురకు సంబంధించిన హింసాత్మక వార్తలు బూటకమని హోం మంత్రిత్వ శాఖ (MHA) గుర్తించింది.
Legal Rights Protection Forum (LRPF)వర్కింగ్ ప్రెసిడెంట్ సంతోష్ అయ్యలసోమయాజుల మాట్లాడుతూ “ప్రైజ్ మనీ ద్వారా భారతీయ జర్నలిస్టులను ప్రభావితం చేసే ఈ ప్రయత్నాన్ని ఆపకపోతే, రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ ప్రైజ్ మనీని ప్రకటించడానికి ఇది ఒక ఉదాహరణ అవుతుంది. భారతీయ మీడియా సంస్థలు, జర్నలిస్టులు విదేశీ విరాళాలను అంగీకరించకుండా స్పష్టంగా నియంత్రించే FCRA చట్టంలోని నిబంధనలను తప్పించుకోవడానికి ఇది ఒక లొసుగుగా కూడా ఉపయోగించబడుతుంది అని సంతోష్ చెపారు.
ఈ నేపథ్యంలో, IAMC ప్రైజ్-మనీ ద్వారా భారతీయ జర్నలిస్టులు మరియు మీడియా సంస్థలకు విదేశీ నిధులు సమకూర్చే విషయాన్ని పరిశీలించాలని హోమ్ మంత్రిత్వ శాఖకు కి LRPF ఫిర్యాదు చేసింది.
~ చాడా శాస్త్రి