జహంగీర్‌పురి అల్లర్ల నిందితుడిని ఢిల్లీ పోలీసులు రోహిణి కోర్టుకు తీసుకువెళుతున్నప్పుడు పుష్ప చిత్రంలో అల్లుఅర్జున్ లా ‘తగ్గేదే లే’ అన్నట్టు సైగలు చేసాడు. వార్తా సంస్థ ANI షేర్ చేసిన వీడియోలో నిందితులలో ఒకరైన అన్సార్ ను కోర్టుకు తీసుకెళ్తున్నప్పుడు పోలీసులు అతని చేతిని పట్టుకుని వెళ్తుండగా నవ్వుతూ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చేసినట్లుగా తన గడ్డం మీద చేతిని కదిలిస్తూ ‘తగ్గేదే లే’ అనే సైగను చేయడం కన్పిస్తుంది.
#WATCH | Accused in Jahangirpuri violence case being taken to Rohini court pic.twitter.com/UZZPobYZ4n
— ANI (@ANI) April 17, 2022