కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి పార్టీ నుంచి తప్పుకోనున్నట్టుగా ప్రకటించారు. త్వరలోనే పార్టీకి రాజీనామా చేస్తానని అన్నారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్నా తనని కోవర్ట్ గా చిత్రీకరించారని, కొందరు ప్రణాళికా బద్దంగా యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ విషయమై తన భార్యకు ఫోన్ కాల్స్ కూడా రావడం తనకు ఇబ్బంది కల్గించిందంటూ అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేనని వాపోయారు. నా వల్లే పార్టీ ఇబ్బంది పడుతుందన్నట్టు ఫీలింగ్ కలిగిస్తున్నారు అని అన్నారు. తెరాస, బీజేపీ లో చేరే ఆలోచన లేదని పేర్కొన్నారు. త్వరలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లకు లేఖ రాయనున్నట్టు తెలిపారు. ఈ నిర్ణయంతో తెలంగాణాలో రాజకీయాలు వేడెక్కాయి.
జగ్గారెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ కీలక నేతలు రంగంలోకి దిగారు. ఇప్పటికే మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జగ్గారెడ్డితో ఫోన్లో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేశారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లి కిషన్ జగ్గారెడ్డితో భేటీ అయి ఆయన్ను బుజ్జగించేందుకు ప్రయత్నించారు. మీ లాంటి నేతలు పార్టీని వీడొద్దని ఆయనకు విజ్ఞప్తి చేశారు.