జగేయి మతారీ జగేయి పండుగ పర్ది కే గ్రామములో ఘనంగా సంప్రదాయ పద్ధతిలో నిర్వహించడం జరిగింది. పొలాల అమావాస్య పండుగ సందర్భంగా తెల్లవారు జామున గ్రామ పెద్దలు వెదురు కర్రలతో , జగేయి మాతరి జగేయి,అంటూ కొట్టుకుంటూ పోతారు,అప్పుడు గ్రామములో ఉన్న జబ్బులు ,దోమలు, పారిపోవాలని ఇలా చేస్తారు. ఈ రోజు అమావాస్య ఉంటది కాబట్టి అక్కడ ఉన్న వన మూలికలు తీసుకువస్తారు.అవి చిన్న పిల్లలకి,బయపడినప్పుడు ఏడ్చి నప్పుడు ఎరకుల పొగ పట్టిస్తే నయం అవుతాయి అని ఆదివాసుల నమ్మకం.