ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్. ‘మన్ కీ బాత్’ రేడియో షో 100వ ఎపిసోడ్ ఏప్రిల్ 30వతేదీన ప్రసారం కానున్నసంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మోదీని అభినందిస్తూ…మన్ కీ బాత్ పేరుతో దేశప్రజలతో మోదీ కనెక్ట్ అవుతున్నారని…వందేళ్ల ఎపిసోడ్ పూర్తి చేసుకోనుండడం సంతోషంగా ఉందని అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రసమాచార, ప్రసారశాఖమంత్రి అనురాగ్ ఠాకూర్ తో కలిసి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఏర్పాటు చేశారు. దేశాధినేత ప్రజలతో సంభాషించే ముఖ్యమైన కార్యక్రమంలో ఆలోచనలు తీసుకోవడం, సూచనలు ఇవ్వడం గొప్ప విషయమని అమీర్ అన్నారు. ఇక 100వ ఎపిసోడ్ కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని మోదీ అన్నారు. 2014లో మొదటిసారి ప్రధాని అయినప్పటినుంచి మోదీ ఈ రేడియో కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.
#WATCH | 'Mann Ki Baat' has had a huge impact on the people of India, says Aamir Khan at "Mann Ki Baat@100" National Conclave in Delhi. pic.twitter.com/Jx7yUn7uOM
— ANI (@ANI) April 26, 2023