భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవం’లో భాగంగా ‘హర్ ఘర్ తిరంగ’కు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు దేశ సరిహద్దుల్లో 12వేల అడుగుల ఎత్తున త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు పలువురు జవాన్లు. ఆ వీడియోను సరిహద్దు గస్తీ ఏజెన్సీ ట్విట్టర్లో షేర్ చేసింది. ఈ వీడియో లడఖ్ లోని లేహ్‌లో నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ నుంచి వచ్చాయి. అందులో జాతీయ పతాకాన్ని చేతిలో పట్టుకొని భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు.
भारत माता की जय !
ITBP troops with Tricolour at 12 K feet in Ladakh with the message of 'Har Ghar Tiranga' to urge the citizens to hoist the Tricolour or display it in the homes between 13 to 15 August, 2022.#HarGharTiranga #AzadiKaAmrtiMohotsav pic.twitter.com/NpvS5coZY7
— ITBP (@ITBP_official) July 27, 2022
“భారత్ మాతా కీ జై. ఆగస్టు 13 నుంచి 15 మధ్య త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని లేదా ఇళ్లపై ప్రదర్శించాలని పౌరులను కోరేందుకు ‘హర్ ఘర్ తిరంగ’ సందేశంతో లడఖ్‌లో 12,000 అడుగుల ఎత్తులో త్రివర్ణ పతాకాన్ని ఐటీబీపీ దళాలు ప్రదర్శించాయి” అని ఐటీబీపీ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.