జార్జియ మోలోని – ఇటలీ చరిత్రలో మొట్ట మొదటి మహిళా ప్రధానిగా త్వరలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నది !
అయితే ఇందులో విశేషం ఏముంది ?
రైట్ వింగ్ సపోర్టర్ అయిన మోలోని నేను,నా దేశం,నా మతం, నా దేశ సంస్కృతి అనే నినాదాన్ని గట్టిగా ప్రజలలోకి తీసుకెళ్లగలిగింది.
జార్జియ మెలోని[Giorgia Meloni] చేసిన వ్యాఖ్యలు :
1. ఇటలీ లో కొత్తగా ఎలాంటి మసీదులని కట్టనివ్వను !
2. కొత్తగా మసీదు కట్టాలి అంటే ఆ మసీదు ఇమామ్ ఎవరో ముందుగా తెలపాలి మాకు.
3. రోజూ మసీదులో చేసే ప్రార్ధనకి అర్ధం ఏమిటో మాకు తెలుసు.
4. మసీదులకి నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయి ?
5. మసీదులలో చేసే ప్రార్ధనలు కేవలం ఇటాలియన్ భాషలో చేయాలి.
6. మసీదులలో అరబిక్ భాషలో ప్రార్ధన చేయడానికి అనుమతి ఇవ్వను.
ఇలా జార్జియ మెలోని ఇటలీ ప్రజలని బాగానే ఆకట్టుకుంది. అయితే మెలోని అంటే ఇష్టపడని వాళ్ళు మాత్రం ముస్సోలిని వారసురాలు అని విమర్శిస్తున్నారు.
*********
జార్జియా మెలోని రైట్ వింగ్ యాక్టివిస్ట్ అని తెలిసీ ప్రజలు ఆమెకు మద్దతుగా నిలచారు అంటే ఇటలీ ప్రజల ఆలోచనా సరళి ఎలా ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈ కొత్త ఆలోచనా ధోరణి మంచిదేనా ? మతం ప్రాతిపదికగా ఉన్నసిద్ధాంతాలకి ప్రజలు పట్టం కడుతున్న రోజులు ఇవి. జార్జియా మెలోని ఫక్తు కాథలిక్ క్రిస్టియన్. అదే సమయంలో కేధలిక్ క్రిస్టియన్ కాని వారి పట్ల ఏ మాత్రం సానుభూతి లేదు. అంటే పక్కా రైట్ వింగ్ యాక్టివిస్ట్ అనే అనుకోవాల్సి ఉంటుంది. మతం,దేశం ఈ రెండూ కలగలిసిన రాజకీయం ఇప్పుడేమీ కొత్త కాదు. ఆ మాటకొస్తే రెండు క్రూసేడు యుద్ధాలు జరిగింది దేని కోసం ?
**********
యూరోపు ముఖ చిత్రం మారుతున్నది !
ఒక సారి ఫ్రాన్స్ ని పరిశీలిస్తే మొదట్లో ఉదారవాదాన్ని నెత్తినపెట్టుకొని తద్వారా వలసలని ప్రోత్సహించి దరిమిలా తాము ఇతర దేశాలకంటే సమానత్వాన్ని గౌరవిస్తాము గొప్పలకి పోయింది. కానీ ఈ రోజున ఫ్రాన్స్ లో ఉన్న పరిస్థితి ఏమిటి ? పారిస్ లోని కొన్ని ప్రదేశాలలో ముస్లిమ్స్ కాని వారికి ప్రవేశం ఉండదు. ఒకవేళ ఆయా ప్రదేశాలలోకి ఎవరన్నా వెళ్ళినా సురక్షితంగా తిరిగి వస్తారన్న నమ్మకం లేదు. పారిస్ పోలీసులు కూడా ఆ ప్రాంతాలలోకి స్వేచ్ఛగా వెళ్లలేరు. ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ ఫ్రాన్స్ లో కఠిన ఆంక్షలు విధించాడు ముస్లిం సమాజం మీద. గత ఎన్నికలలో రెండో సారి మాక్రాన్ గెలిచినప్పుడు అంతో కొంత ఫ్రాన్స్ ప్రజలలో అసంతృప్తి కలిగింది అన్నది వాస్తవము. మాక్రాన్ తో అధ్యక్ష పదవికి పోటీ పడ్డ మేరీ లీ పెన్ [Marie Le Penn] ఫక్తు రైట్ వింగ్ యాక్టివిస్ట్ కానీ తృటిలో తప్పిపోయింది ఈవిడకి అధ్యక్ష పదవి. అలా అని లీ పెన్ మళ్ళీ అధ్యక్షపదవికి పోటీ చేసే అవకాశం ఉంది అలాగే గెలుస్తుంది కూడా. లీ పెన్ కి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో సన్నిహిత సంబంధం ఉంది. ఇద్దరూ మంచి మిత్రులు. గత ఎన్నికల సమయం లో పుతిన్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న లీ పెన్ కి విరాళాలు కూడా ఇచ్చాడు.
*********
జర్మనీ ఇప్పటికే శరణార్ధుల రూపంలో వచ్చిన వాళ్ళతో చాల ఇబ్బందులని ఎదుర్కుంటున్నది. పెరిగిన ఇంధనం,ఆహార పదార్ధాల ధరలతో సతమతం అవుతున్న జర్మనీకి సిరియా,ఆఫ్ఘనిస్తాన్ ల నుండి వచ్చిన శరణార్ధుల వల్ల మరింత ఇబ్బందులకి గురువతున్నది. అప్పటి జర్మనీ ఛాన్స్లర్ మోర్కెల్ ఉదార స్వభావం తో ఆశ్రయం ఇచ్చింది సిరియా,ఆఫ్ఘనిస్తాన్ శరణార్ధులకి కానీ ఇప్పుడు వాళ్ళని భరించడం చాలా కష్టంగా మారింది.
********
బెల్జియం :
1960 వ దశకం లో బెల్జియం లో కూలి పని చేయడానికి అంటూ మొరాకో దేశం నుండి వలసలని ప్రోత్సహించింది అప్పటి ప్రభుత్వం. అలా మొరాకో,టర్కీ దేశాల నుండి బెల్జియం కి వలస వచ్చిన వాళ్ళు క్రమంగా అక్కడి పౌరసత్వం తీసుకొని ఉండిపోయారు. 2018 లో బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో షరియా చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. దాదాపుగా కోటి జనాభా ఉన్న బెల్జియం దేశంలో అత్యధిక ముస్లిం ప్రజలు ఉన్నది రాజధాని బ్రస్సెల్స్ లోనే. అయితే ఇప్పటికిప్పుడు ఎలాంటి ఆందోళనలు లేకపోయినా భవిష్యత్తులో మాత్రం బెల్జియం ని ముస్లిం దేశంగా మారుస్తాము అంటూ అక్కడి ఇస్లాం పార్టీ ప్రకటించింది.
*******
ఇక బ్రిటన్ గురుంచి చెప్పుకోవాల్సింది ఏముంది ? తాజాగా బ్రిటన్ లోని లీసెస్టర్ ప్రాంతంలో జరిగిన సంఘటనలని చూస్తే ప్రస్తుతం బ్రిటన్ అగ్నిపర్వతం మీద ఉన్నది అనే చెప్పాల్సి ఉంటుంది.
******
పోలండ్ ;
గతంలో సిరియా శరణార్ధులని అక్కున చేర్చుకున్న పోలండ్ ప్రస్తుతం వాళ్ళని తిరిగి పంపిస్తున్నది.
*******
ఇక ఇటలీ విషయానికి వస్తే రైట్ వింగ్ విజయం వలన ముందు ముందు ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయో ఊహించడానికి పెద్దగా కష్టపడనవసరం లేదు. 2016 లెక్కల ప్రకారం ఇటలీ లో మొత్తం ముస్లిం జనాభా 14,00,000 [పద్నాలుగు లక్షల మంది ] ఉన్నారు. వీళ్లలో 2 లక్షల 50 వేల మందికి ఇటలీ పౌరసత్వం ఉంది. మిగిలిన వాళ్ళలో అక్రమంగా ఎంత మంది ఉన్నారో అలాగే ఉద్యోగార్ధం ఎంత మంది ఉన్నారో సరి అయిన వివరాలు లేదు. ఇప్పుడు కొత్తగా ప్రధాని పదవిని స్వీకరించబోతున్న జార్జియా మెలోని అక్రమంగా ఉంటున్న వారిని వెనక్కి పంపిస్తుందా ? ఖచ్చితంగా పంపిస్తుంది. అయితే ఈ పని అంత సజావుగా ప్రశాంతంగా జరిగే అవకాశాలు లేవు. ఎందుకని ? ఇటలీ లోని లెదర్ పరిశ్రమలలలో దాదాపుగా 2 లక్షల మంది చైనా పౌరులు పని చేస్తున్నారు. స్వతహాగా కమ్యూనిస్ట్ దేశం అయిన చైనా కి ఇటలీ లో అందులోనూ కీలకమయిన యూరోపు దేశంలో రైట్ వింగ్ ప్రభుత్వం ఉండడం సుతరాము ఇష్టపడదు కాబట్టి ఎన్ని లక్షల డాలర్లు ఖర్చు పెట్టి అయినా అక్కడ ఘర్షణలని ప్రోత్సహిస్తుంది. అంటే ఇటలీ లో అక్రమంగా ఉంటున్న ఇతర దేశాల ముస్లిం పౌరులని వెనక్కి పంపే ప్రక్రియలో ఘర్షణ వాతావరణాన్ని ఎదుర్కోకక తప్పదు. అలాగే ఇటలీ లో ఉన్న ఉదారవాద లెఫ్టిస్ట్ లకి చైనా నుండి నిధులు అందుతాయి కాబట్టి ఘర్షణ తప్పదు. ఈ క్రమంలో దౌత్య పరమయిన విభేదాలు వచ్చి తీరుతాయి కాబట్టి జార్జియా మెలోని ఎంత కఠినంగా వ్యవరిస్తుందో అన్న దాని మీద ఇటలీ,చైనా ల మధ్య సంబంధాలు ఉండబోతున్నాయి. అయితే ఆర్ధడాక్స్ క్రైస్తవం ని ఆచరించే రష్యా మీద జార్జియా మెలోని ఎలాంటి సంబంధాలని నెరపుతారో అనే ఉత్సుకత ఇప్పటికే ఉంది. ఒక వేళ జార్జియా మెలోని కనుక పుతిన్ వైపు మొగ్గు చూపితే అది యూరోపు యూనియన్ విచ్ఛిన్నం కి దారి తీస్తుంది. మరో మూడేళ్ళ తరువాత ఫ్రాన్స్ లో లీ పెన్ అధికారంలోకి వస్తే అది రష్యాకి అనుకూలంగా ఉంటుంది. ఇప్పటికే జర్మనీ లోపాయికారిగా రష్యా కె మద్దతు తెలుపుతున్నది. కాబట్టి జర్మనీ,ఫ్రాన్స్,ఇటలీ లు రష్యా వైపు మొగ్గు చూపితే అది అమెరికా వినాశనాకి కారణం అవుతుంది. ఇప్పటికే తుగ్లక్ ని మించి నిర్ణయాలు తీసుకుంటున్న లెఫ్ట్ వింగ్ బిడెన్ యంత్రాంగం కి ఒక గుణపాఠం అవబోతున్నది.
ఆఫ్కోర్స్ ! ఇది జరగడానికి మరో రెండేళ్ళు పట్టవచ్చు!యుద్ధం వద్దు ! అమెరికా అభివృద్ధి,ప్రయోజనాలే ముఖ్యం అన్న ట్రంఫ్ ని పక్కన పెట్టిన అమెరికన్ ప్రజలకి జోహార్లు!
అలాగే ఈ రైట్ వింగ్ ప్రభంజనం ఇలాగే కొనసాగితే [ప్రపంచమంతా ] ఎన్ని లక్షల డాలర్లు ఖజానాలో ఉంటే మాత్రం ఏం లాభం ?
ఈ మొత్తం విశ్లేషణ నా స్వంత అభిప్రాయం గా స్వీకరించండి !
నేను చెప్పింది జరగవచ్చు లేదా జరగకపోవచ్చు.
ఈ పరిణామాల మీద సోనియా స్పందన ఏమిటో ఏ విలేఖరి అడగడు!మరి ఆవిడ స్వంత దేశం కదా ?
సోనియాకి రైట్ వింగ్ విజృంభణ అస్సలు నచ్చక పోవచ్చు కానీ తన మాతృ దేశంలో జరుగుతున్న పరిణామాల్ని సోనియా జవాబు చెప్పాల్సిందే ! ఓకే ! ఆవిడ క్రైస్తవురాలు కావొచ్చు! మరి భారత దేశంలో హిందువుల హక్కుల గురుంచి మాట్లాడాలి కదా ? అలాగే రాహుల్ కూడా యూరోపియన్ ప్రజలు చాలా …. చాలా అడ్వాన్స్డ్ అని భావించే వాడు కదా ? ఇప్పుడు తల్లీ కొడుకులు స్పందించాలి !
వాళ్ళు స్పందించరు! వాళ్ళకి వాళ్ళ ఆస్తులే ముఖ్యం మరి !
Home News International ఇటలీ మొదటి మహిళా ప్రధానిగా రైట్ వింగ్ సపోర్టర్ – ఆమె నినాదం ‘నా మతం, నా సంస్కృతి’