ముస్లిమేతరులు హలాల్ మాంసాన్ని తినడం అంటే ధర్మభ్రష్టులవడమేనని కర్నాటక బీజేపీ నాయకులు రహీమ్ ఉచిల్ అన్నారు. హలాల్ చేసిన విషయాన్ని దాచి పెట్టి ముస్లిమేతరులు దాన్ని తినేలా చేయడం ముస్లింలకూ మంచిది కాదని కర్నాటక బేరీ సాహిత్య అకాడమీ అధిపతి అయిన రహీం అన్నారు. ఉగాది వేడుకల తరువాత హలాల్ చేసిన మాంసాన్ని నైవేద్యానికి కొనుగోలు చేయవద్దని కొన్నివర్గాలు కోరడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది.
“హలాల్ ఇస్లాంలో అంతర్భాగం, ఇది గత 1,400 సంవత్సరాలుగా ఆచరణలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ప్రార్థనలు చేసిన తర్వాత ,హలాల్ పద్ధతి ప్రకారం సిద్ధం చేసిన మాంసాన్ని తీసుకుంటారు”. అయితే “హలాల్ చేసిన విషయాన్ని దాచి పెట్టి ఆ మాంసాన్ని ముస్లిమేతరులు తినేలా చేయడం సరికాదని ఆయన స్పష్టం చేశారు.
రాజకీయ ప్రయోజనాల కోసం ఈ అంశాన్ని వాడుకోవద్దని…మత పెద్దలు చర్చించి సామరస్య పూర్వక పరిష్కారం కనుగొనాలని… ఓ నిర్ధిష్ట వస్తువును హలాల్ గా గుర్తించడానికి ఏం చేయాలో ముస్లిమేతరులకు తెలియచేయడం ముస్లింల విధి అని ఆయన అన్నారు. హలాల్ చేసేటప్పుడు ప్రార్థనల సందర్భంగా వాడే పదాలు, దాని అర్థాన్ని ముస్లిమేతరులకు చెప్పాలనీ ఆయనఅన్నారు. కానీ దాన్ని దాచి వ్యాపారం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు రహీం.
ఇక హలాల్ ను ఆర్థిక జిహాద్ గా అభివర్ణించారు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి. “హలాల్ ఒక ఆర్థిక జెహాద్. అంటే ముస్లింలు ఇతరులతో వ్యాపారం చేయకూడదని… దీనిని జెహాద్ లాగా ఉపయోగిస్తున్నారు.హలాల్ మాంసం తినాలని వారు చెప్పినప్పుడు వద్దని చెప్పడంలో తప్పేముందని ఆయన ప్రశ్నిస్తున్నారు.
తమ దేవుడికి అర్పించే హలాల్ మాంసం వారికి ప్రీతికరం అవుతుంది తప్ప హిందువులకు ఎలా ఆమోదయోగ్యం అవుతుంది.హలాల్ ఉత్పత్తులను ముస్లింలనుంచి మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంత అవసరం హిందువులకు ఏముంటుందన్నీ ప్రశ్న.
కర్ణాటకలోని మైసూరు మాండ్య ప్రాంతంలో ఉగాది పండుగ తరువాతి హోసతొడకు వేడుకలకు హలాల్ మాంసాన్ని బహిష్కరించాలని కొన్ని సంస్థలు పిలుపునివ్వడంతో ఈ అంశం చర్చకు వచ్చింది. ఉత్సవాల్లో భాగంగా ఇళ్లల్లో వండిన మాంసాన్ని దేవీదేవుళ్లకు నైవేద్యంగా పెడుతుంటారు. ముస్లింలు వారి దేవుడికి పెట్టిన తరువాత విక్రయించే హలాల్ మాంసాన్ని తమ దేవుళ్లకు కొనుగోలు చేయడం సరికాదని హిందూజనజాగృతి సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి మోహన గౌడ అంటున్నారు. అందుకే ముస్లిం వ్యాపారుల దగ్గర మాంసం కొనవద్దని నిర్ణయించామని…అయితే ముస్లింలు హలాల్ చేయని మాంసాన్ని అమ్మితే కొనేందుకు అభ్యంతరం లేదనీ స్పష్టం చేస్తున్నారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)