సిగ్గు ఉండాలి!
మేము స్థాపించిన…..అంటూ ఇస్రో ని తమ ఖాతాలో వేసుకోవడానికి సిగ్గు ఉండాలి కాంగ్రెస్ కి!
మరిచిపోయారా? రాకెట్ ఇంజిన్ ని ఎద్దుల బండి లో పెట్టుకొని లాంచింగ్ సైట్ కి తీసుకెళ్లిన ఘటనని?
మరో వైపు విమానంలో బర్త్ డే కేక్ కట్ చేసిన ఇందిరని మరిచిపోయారా?
హాకీ జట్టుకు బూట్లు కొనడానికి నిధులు లేవు కానీ సిగరెట్, చెప్పులు లక్నో నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తెప్పించుకున్న సంగతిని మరిచిపోయారా?
చైనా యుద్ధంలో భారత సైనికులకి చలికి తట్టుకునే దుస్తులు, బూట్లు ఇవ్వలేదన్న సంగతిని మరిచిపోయారా?
చంద్రయాన్2 విఫలం అయినప్పుడు ప్రజా ధనాన్ని ఇస్రో మీద ఖర్చు పెట్టడం దండగ అని విమర్శించింది కాంగ్రెస్ నాయకులు అన్న సంగతి మరిచిపోయారా?
కాంగ్రెస్ నాయకులు చైనా పాట పాడుతున్నారు !
నిన్న చంద్రయాన్ 3 లాంచింగ్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఇస్రో అధికారిక యూ ట్యూబ్ ఛానెల్ లో 18 లక్షల మంది చూశారు. దూరదర్శన్, ఇతర చానెల్స్ లో చూసిన వారి సంఖ్య ని కలుపుకుకుంటే 2 కోట్ల మంది ఉంటారు.
DRDO, ISRO లకి గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్ని నిధులు ఇచ్చింది? 2014 నుండి ఇప్పటివరకు బీజేపీ ఎన్ని నిధులు ఇచ్చింది అన్న వివరాలు బహిరంగంగా చెప్పగలరా?
‘నేను నా దేశం పవిత్ర భారత దేశం’ అనే భావాన్ని ప్రజలలోకి బలంగా తీసుకెళ్లింది మోదీనే