2021-23 మధ్య కాలంలో విదేశీ ఉపగ్రహాల ప్రయోగాలకు సంబంధించి నాలుగు దేశాలతో ఒప్పందం చేసుకున్నామని అణుశక్తి, అంతరిక్షశాఖ మంత్రి డా. జితేంద్ర సింగ్ అన్నారు. ఈ విదేశీ ఉపగ్రహాలను వాణిజ్య ప్రాతిపదికన ప్రయోగించడం ద్వారా 132 మిలియన్ యూరోల ఆదాయం వస్తుందని రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 1999 నుంచి 34 దేశాలకు సంబంధించిన మొత్తం 342 విదేశీ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించిందని మంత్రి వివరించారు.