ఇజ్రాయెల్, హమాస్ ఉగ్రవాదుల మధ్య పోరు కొనసాగుతోంది. తాజాగా గాజాలోని మీడియా బిల్డింగ్ పైన ఇజ్రాయెల్ క్షిపణి దాడి చేసింది. అయితే అంతకుముందే హెచ్చరికలు జారీ చేయడంతో ప్రాణనష్టం జరగలేదు. హెచ్చరికలు అందుకున్న వెంటనే బిల్డింగ్ మొత్తం ఖాళీ అయింది. గంటసేపటికే క్షిపణిలతో భారీ భవనాన్ని సేనలు పేల్చేశాయి. దాన్ని మీడియా భవనంగా పిలుస్తున్నారు. విదేశీ మీడియా సంస్థల ఆఫీసులు ఆ భవనంనుంచే కార్యకలాపాలు సాగిస్తుంటాయి. వివిధ మీడియా సంస్థల కార్యాలయాలతో పాటు సాధారణ పౌరులూ అందులో నివాసం ఉంటున్నారు. 12 అంతస్థుల ఆ భవన యజమానికి ముందే హెచ్చరికలు చేయడంతో అందర్నీ ఖాళీ చేయించారు. ఇక ఇప్పటివరకు ఇరు వర్గాల మధ్య జరిగిన దాడుల్లో గాజా సిటీ వరకు 139మంది పౌరులు మృతి చెందారు. ఇజ్రాయెల్లో జరిగిన దాడులకు 8మంది బలయ్యారు.