ఇస్లామిస్టులు, ఖలిస్థాన్ వేర్పాటువాదులు, మావోయిస్టులతో పాటు…వివాదాస్పద వ్యక్తులు, సంస్థల జాబితాను ఫేస్ బుక్ బ్లాక్ లిస్టులో పెట్టింది. ఉగ్రవాద వ్యాప్తికి కొందరు వ్యక్తులు, సంస్థలు ఫేస్ బుక్ ను వేదిగ్గా చేసుకుంటున్నారనే ఆరోపణలు ఎప్పటినుంచోఉన్నాయి. ముఖ్యంగా టెర్రరిస్టులు తమ రిక్రూట్ మెంట్లకోసం సోషల్‌మీడియాను ప్లాట్ ఫాంగా చేసుకుంటున్నాయని అమెరికా కాంగ్రెస్, ఐక్యరాజ్య సమితి సైతం ఆరోపించింది. ఫేస్ బుక్ ఆంక్షలు విధించే జాబితాలో పలు సంస్థలు, వ్యక్తులున్నారు. ముఖ్యంగా తీవ్రవాద సంస్థలు, అలాంటి సంస్థలతో సబంధం ఉన్నవారు, సీపీఎం మావోయిస్టులు ఉన్నారు. ఖలిస్తాన్ వేర్పాటు వాద సంస్థలు, వ్యక్తులు కూడా ఉన్నారు.
ఖలిస్తాన్ వేర్పాటువాద సంస్థలు, వ్యక్తులు….
ఖలిస్తాన్ బింద్రన్ వాలే టైగర్ ఫోర్స్, ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ టెర్రర్, ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ టెర్రర్, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ టెర్రర్ సంస్థలతో పాటు…ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్ కు చెందిన సభ్యులు భూపిందర్ సింగ్ భిందా, గుర్మీత్ సింగ్ బగ్గా, హర్మిందర్ సింగ్ మింటూ, పరంజిత్ సింగ్ పంజ్వార్, రంజీత్ సింగ్ నీతా ఉన్నారు. ఇక ఖలిస్తాన్ ఉగ్రవాది బింద్రన్ వాలే మేనల్లుడు లక్బీర్ సింగ్ కు చెందిన ఇంటర్నేషనల్ సిక్కు యూత్ ఫౌండేషన్ ఉన్నాయి.
భారత్ నుంచి కమ్యూనిస్టు, ప్రాంతీయ నక్సల్స్ సంస్థలు….
భారత కమ్యూనిస్టు పార్టీ-సీపీఎం, కంగ్లీపాక్ కమ్యూనిస్ట్ పార్టీ, త్రిపుర టైగర్ ఫోర్స్-సౌత్ ఏషియా, నాగాలాండ్ నేషనలిస్ట్ సోషలిస్టు కౌన్సిల్-ఇసాక్, కంగ్లీపాక్ టెర్రర్ పీపుల్స్ రివల్యూషనరీ పార్టీ, యూనైటెడ్ లిబరేషన్ ఫ్రండ్ ఆఫ్ అసోం, బేస్ మూవ్ మెంట్…
భారత్ తో లింక్ ఉన్న ఇస్లామిక్ సంస్థలు…
ఆల్ ఆలం మీడియా-ఇండియా మీడియా వింగ్ అన్సార్ గజ్వల్ ఉల్ హిందీ, అల్ సహబ్ ఇండియన్ కాంటినెంట్, మీడియా వింగ్ అల్ ఖైదా, అల్ ఖైదా సెంట్రల్ కమాండ్, అల్-బదర్ ముజాహిదీన్, అల్ -ముర్సలాత్ మీడియా, ఇండియా మీడియా వింగ్ ఇస్లామిక్ స్టేట్, అల్-ఖైదా, దావత్-ఎ-హక్ టెర్రర్ ఇండియా మీడియా వింగ్ ఇస్లామిక్ స్టేట్, ఇండియన్ ముజాహీదీన్ టెర్రర్ దక్షిణాసియా, జమాతె ఉల్ ముజాహిదీన్ టెర్రర్ దక్షిణాసియా, ఇండియా, పాకిస్తాన్ ,సహమ్ అల్-హింద్ మీడియా టెర్రర్ ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ మీడియా వింగ్ జెమా ఇస్లామియా, జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్, అల్ ఖైదా సెంట్రల్ కమాండ్, సౌత్ అల్-హింద్ టెర్రర్ ఇండియా, పాకిస్తాన్ మీడియా వింగ్ ఇస్లామిక్ స్టేట్… రెసిస్టెన్స్ ఫ్రంట్, అఫ్జల్ గురు స్క్వాడ్, అల్ రషీద్ ట్రస్ట్, అల్ రెహమత్ ట్రస్ట్, అల్-అక్సా మీడియా జమ్మూ & కాశ్మీర్, ఇస్లామిక్ స్టేట్ జమ్మూ & కాశ్మీర్, జైషే మహ్మద్ కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్‌లోని తెహ్రీక్-ఇ-ఆజాది, విలాయత్ కశ్మీర్ ….
పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న 78 మంది కూడా ఈ జాబితాలో ఉన్నారు. పాకిస్తాన్ నుంచి 52 ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు, బంగ్లాదేశ్ నుంచి ఆరు సంస్థలున్నాయి.
ఆఫ్హనిస్తాన్ ను తాలిబన్లు స్వధీనం చేసుకున్న తరువాత ఎఫ్‌బీని పూర్తిగా నిషేదించారు. తాలిబన్ కంటెంట్ ను అంగీకరించడం అంటే ఆ ప్లాట్ ఫామ్ ఉగ్రవాదానికి మద్దతిస్తున్నట్టేనని యూఎస్ చట్టాలు చెబుతున్నాయి.
ప్రారంభంలో DIO విధానం అమల్లోకి తెచ్చిన కొత్తలో అకౌంట్ యూజర్లపట్ల విద్వేషపూరిత ప్రమాదకరమైన కంటెంట్ వాడినవాళ్లపై నిషేధించడం విధించడం వరకు ఉండేది. అయితే రాన్రానూ ఆంక్షలు కఠినతరం అయ్యాయి. ఇటీవల సోషల్‌మీడియా యూజర్ బేస్ అంతటా విస్తరించడంతో మరిన్ని ఆంక్షలు వచ్చాయి. ఇటీవల విడుదలైన బ్లాక్ లిస్టులో రచయితలు, రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు వంటి 4 వేల సంస్థలు, వ్యక్తులు ఉన్నారు.
ద్వేశపూరిత ప్రసంగం, ఇతర విధానాలను నిరసిస్తూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అకౌంట్ ను ఎఫ్బీ నిషేదించింది. జాబితాను పబ్లిక్ చేయడానికి ఫేస్ బుక్ కు అభ్యర్థనలు వస్తున్నా అందుకు సంస్థను నిరాకరించింది. జాబితాను బహిర్గతంచేస్తే తమ ఉద్యోగులు ప్రమాదంలో పడతారని ఎఫ్బీ పదే పదే చెప్పింది. అయితే అలాంటి సమాచారమేదీ తమకు లేదని ఇంటర్ సెప్ట్ అంది. ప్రజా ప్రయోజనాల కోసమైనా జాబితాను పబ్లిక్ చేయాలని సిఫార్సు చేసింది.
మా ఎఫ్బీ వేదిగ్గా ఉగ్రవాదులు, ద్వేషపూరిత గ్రూపులు, నేర సంస్థలు తమ ప్రచారం చేయడాన్ని, ప్రకటనలు చేయడాన్ని తాము అంగీకరించబోమని ఫేస్ బుక్ పాలసీ డైరెక్టర్ బ్రియాన్ ఫిష్ మాన్ అన్నారు.అందుకే అలాంటి వ్యక్తులు, సంస్థల్ని నిషేధించడంతో పాటు… అలాంటి వాటికి మద్దతిచ్చేలా ఉన్న కంటెంట్ ను తొలగిస్తామని స్పష్టం చేసింది. అందుకోసం 350 మందికి పైగా నిపుణులు ఆ పనిమీదే ఉన్నారు.
జాబితాలో ఎక్కువ పేర్లు యూఎస్ ప్రభుత్వం నుంచి వచ్చాయి. దాదాపు వెయ్యి ఎంట్రీలు “SDGT,” ప్రత్యేకంగా నియమించిన గ్లోబల్ టెర్రరిస్టులవని తేలింది. ట్రెజరీ శాఖ నిర్వహించే జాబితా నుంచి ఈపేర్లు ఎంపిక చేశారు. 9/11 దాడి తరువాత నాటి ప్రెసిడెంట్ జార్జ్ బుష్ రూపొందించినది.
ఇంటర్ సెప్ట్ 11 పేజీల డాక్యుమెంట్ ను కూడా ప్రచురించింది. ఫేస్ బుక్ లో ఎలాంటి కంటెంట్ అనుమతించాలి.. దేన్ని తక్షణమే తొలగించాలనే వివరాలున్నాయి. ఉగ్రవాద సంస్థలు, విద్వేషపూరిత సంస్థలు, నాయకులు, మూకదాడులు, హత్యాకాండలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన కంటెంట్ ను ఫేస్ బుక్ తొలగిస్తుంది. కశ్మీర్ భవిష్యత్తు కోసం హిజ్బుల్ ముజాహిదీన్ లో చేరారు, హిజ్బుల్ ముజాహిదీన్ నాలాంటి కశ్మీరీల కోసం చూస్తోంది. కశ్మీర్ స్వేచ్ఛాస్వాతంత్ర్యాల కోసం హిజ్బుల్ ముజాహిదీన్ పోరాడుతూ గెలుస్తోంది వంటి స్టేట్మెంట్లు అనుమతించరు.