రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పట్టపగలు ఇద్దరు ముస్లిం వ్యక్తులు ఒక హిందూ వ్యక్తి తల నరికి చంపిన తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) బృందం నిన్న రాజస్థాన్‌కు వెళ్ళింది. NIA బృందంలో ఒక డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డిఐజి)-ర్యాంక్ అధికారి ఉన్నారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) నుంచి ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
https://twitter.com/TajinderBagga/status/1541755611456557057?s=20&t=Xs6qAJrfOhMDeifFC0Oy_A
NIA బృందం నేరం జరిగిన స్థలాన్ని సందర్శించిన తర్వాత చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టంలోని నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసే అవకాశం ఉంది.
ఉదయపూర్‌లోని మాల్దాస్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నేరం చేసిన వెంటనే, ఇద్దరు నిందితులు తలా నరకడం గురించి గొప్పగా చెబుతూ సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేసి, ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఇలాగే ప్రాణహాని ఉంటుందని అన్నారు. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
నిందితుల్లో ఒకరు రియాజ్ అక్తర్, కన్హయ్య లాల్‌పై పదునైన ఆయుధంతో దాడి చేయగా.. మరొకరు ఘోస్ మహ్మద్ తన మొబైల్ ఫోన్లో నేరాన్ని రికార్డ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
https://twitter.com/dsparmar_10/status/1541744607817388032?s=20&t=92CFqoQFKCRpIYs4z5bkKg
మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ బీజేపీ నాయకురాలు నూపుర్ శర్మకు మద్దతుగా బాధితుడు, టైలర్ ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్‌ను షేర్ చేసాడు. ఈ పోస్ట్ కి వ్యతిరేఖంగా ఈ ఇద్దరు ఇస్లాం వాదులు హత్యకు పాల్పడ్డారు. హత్య తర్వాత బాధితుడికి న్యాయం చేయాలని వ్యాపారులు డిమాండ్ చేయడంతో ఆ ప్రాంతంలోని స్థానిక మార్కెట్లను మూసివేశారు.
ఉదయపూర్‌లో 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి, కర్ఫ్యూ విధించారు.
“నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు, శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి. సమీప ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించాం”అని ఉదయపూర్ ఎస్పీ మనోజ్ కుమార్ తెలిపారు.