ఉజ్జయిని మహంకాళేశ్వరుడి దర్శించుకోవడమే పాపమైనట్టు… ఇస్లామిస్టుల దాడికి గురైంది బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్. తన ఆత్రంగి రే మూవీ విడుదలకు ముందురోజు ఆమె ఉజ్జయిని జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంది. అందుకు సంబంధించిన ఫొటోలను ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. అందులో కండువాను తలకు చుట్టుకుని కనిపించారు.సాయంత్రం హారతి సమయంలో దాదాపు అరగంటపాటు ఆమె ఆలయంలో గడిపారు. అదే విషయాన్ని చెబుతూ ‘జై మహాకాల్’ అని పోస్ట్ చేశారు.
ఆమె ఫొటోను అలా షేర్ చేసిందో లేదో ఇస్లామిస్టులు దాడి ప్రారంభించారు. విగ్రహారాధన చేసి పాపం చేశావంటూ ముస్లిం మతోన్మాదులు దుర్భాషాలాడారు. ‘అసలు ఎందుకిలా చేస్తున్నావ్..నువ్ ముస్లింవేనా…దేవాలయాలకు ఎందుకు వెళ్తున్నావ్? ‘ అని ఒకరంటే… ముస్లి అయి ఉండీ విగ్రహాన్ని మొక్కుతావా అంటూ మరొకరు.. ఇక
“నీకు సిగ్గు అనిపించలేదా? నీవంటివాళ్లు ముస్లిం మతానికే మచ్చ ” అని మరొకరు రాశారు.అసలు నువు పేరు మార్చుకో ముందు అని మరొకరు సలహా ఇస్తే… సైఫ్ అలీఖాన్, అమృతాసింగ్ కు పుట్టిన నువ్వు సగం హిందువు, సగం ముస్లిం అని మరొక నెటిజన్ అంటే…కొందరు అభ్యంతరకర భాష వాడారు.
హిందూ దేవాలయాన్ని సందర్శించినందుకు అల్లా నిన్ను క్షమించడు అంటూ కొందరు బెదిరిస్తే… దేవుడు ఒకటే అతడే అల్లా అని మరొక కామెంట్. సారా అలీ ఖాన్ వంటి వాళ్లకు త్వరలోనే ఖయామత్ తప్పదని మరొకరు శాపనార్థాలు పెట్టారు. ఓ మహిళ అయితే సారా అలీ ఖాన్ నువ్వు ఆవు మూత్రం తాగు అనివ్యాఖ్యానించింది. హిందువులపై దాడి చేసుకునే అన్యమతస్తులు తరచూ వాడే పదం గోమూత్రం.
ఇక సారా అలీఖాన్ మీద ఇస్లామిస్టుల దాడి కొత్తకాదు. గతంలో కూడా ఆమె కేదార్ నాథ్ దర్శించిన సందర్భంగా ఆమెపై మూకుమ్మడి దాడి చేశారు. అప్పుడూ ఇలాంటి జుగుప్సాకరమైన కామెంట్లే చేశారు.