అల్లరిమూకపై యూపీ పోలీసుల చర్యపై మీమ్ షేర్ చేసినందుకు ఇస్లామిస్టులకు టార్గెట్ అయ్యాడు కమెడియన్ కునాల్ కమ్రా. జోయా అక్తర్ ‘జిందగీ నా మిలేగీ దొబారా’ చిత్రాన్ని ట్వీట్ చేసాడు. అందులో లేజర్ కళ్లతో కోపంగా కనిపించే పోలీసు హీరోలు లాఠీచార్జ్ చేయడం కనిపిస్తుంది. ఈ చిత్రంలో ఫర్హాన్ అక్తర్, హృతిక్ రోషన్ సహా అభయ్ డియోల్ ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఈ ఫోటోలో హాస్యాన్ని అర్థం చేసుకొని ఇస్లాంవాదులు కమ్రాపై దాడి చేయడం మొదలుపెట్టారు.
శుక్రవారం నమాజ్ తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని పలు నగరాల వీధుల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో.. UP పోలీసులు నిరసనకారులపై కఠినంగా వ్యవహరించారు. నిరసనల సందర్భంగా హింసకు పాల్పడినందుకు 200 మందికి పైగా నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రయాగ్‌రాజ్ హింసాకాండ సూత్రధారి జావేద్ అహ్మద్ అక్రమ ఇంటిని కూడా యూపీ ప్రభుత్వం ఆదివారం కూల్చివేసింది. ఈ సంఘటనను ఉద్ధ్యేశించి కునాల్ ఆ మీమ్ ను పోస్ట్ చేశాడు.
అయితే తమ ఆందోళన అతనికి మీమ్ మెటీరియల్ అయిందా అంటూ మండిపడ్డారు ఇస్లామిస్టులు. తమ మతాన్ని, తమను కించపరిచేవారి తలను తీసేయాలని, మరణ శిక్ష విధించాలని ఆగ్రహం వ్యక్తం చేయడంతో కునాల్ ఆ పోస్టును డిలీట్ చేశాడు.
తమ మృతదేహాలు, ధ్వంసమైన ఇళ్లు కునాల్ కు మెమో గా మారాయా అని ఓ నెటిజన్ వెంటనే ట్వీట్ చేశాడు కూడా. ది వైర్ జర్నలిస్ట్ అలీషన్ జాఫ్రీ కమ్రాను ‘లిబరల్ వాయిస్’ అని ఆరోపించాడు, అతని పోస్ట్‌ను సున్నితత్వంలేని పోస్టు అని అన్నాడు.
No, YOU, a progressive comic who's widely regarded as a liberal voice DID THIS.
You did this because you know you can do this. Mocking police torture of the oppressed, I think, is vulgar. Those of us who'll point out how insensitive this “joke” is, will be called intolerant. pic.twitter.com/gYBNCmNj2p
— Alishan Jafri (@alishan_jafri) June 12, 2022
For @kunalkamra88, @TheDeshBhakt and other UC liberals the Muslim deàd bodies and damaged bodies are just "content" for their videos to mint money. But let me remind you, you need us and it's not the other way around and the money you have minted won't last you forever! pic.twitter.com/e86c9mccjh
— عادل مغل 🇵🇸 (@MogalAadil) June 12, 2022
Our dead bodies and destroyed houses are meme material for @kunalkamra88 pic.twitter.com/LsvQI0Juj1
— Mohd Abuzar Choudhary (@MohdAbuzarCh) June 12, 2022
కమ్రా వంటి కమెడియన్స్ గతంలో తరచుగా హిందువుల మృతదేహాలను ఎగతాళి చేశారు. ఇటీవల అతని సహ కమెడియన్ మునావర్ ఫరూఖీ, ఒక వీడియోలో 2002 గోద్రా మారణహోమంలోని బాధితులను ఎగతాళి చేశాడు. దాన్ని వ్యతిరేకించిన వారిని హిందుమతోన్మాదులుగా అభివర్ణిస్తూ మరింత రెచ్చగొట్టాడు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా జోక్స్ వేసే మునాఫర్ అయినా కునాల్ అయినా ఏనాడూ క్షమాపణ చెప్పలేదు. ఇప్పుడు మాత్రం కమ్రా తన మీమ్ ను షేర్ చేసిన గంటలోపే తొలగించాడు. ఇంతలోనే కమ్రాను తన మీమ్ కారణంగా ‘ఇస్లామోఫోబిక్’ అని ఆరోపించారు. ప్రతిసారీ హిందువులను అపహాస్యం చేసే కునాల్ ఏనాడూ వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు మాత్రం భయపడ్డాడు.