దీపావళి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్‌ను ఇస్లామిస్టులకు టార్గెట్ అయ్యాడు. బాబర్ ఆజం ట్విట్టర్ వేదికగా “To those celebrating, #Happy Diwali. Wish you enough light, peace and love.” అని ట్వీట్ చేసాడు..
ఒక ఇస్లామిస్ట్ బాబర్ ఆజాం ట్వీట్ కు
“మనం ముస్లింలం.. మన మతం ఇస్లాం. .ఇతర మతాలకు చెందిన వాళ్లకు మనం అభినందనలు తెలపొద్దు” అంటూ రీట్వీట్ చేశాడు. కాఫిర్లకు వారి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడం ముస్లిం విధి కాదని మరో ఇస్లామిస్ట్ స్పష్టం చేశాడు. ముహమ్మద్ ఇర్షాద్ అనే మరో ఇస్లామిస్ట్ “అల్లా బాబర్ అజామ్‌ను సరైన దిశలో నడిపించాలని మరియు నిజమైన ఇస్లాం విశ్వాసిగా మారడానికి అతనికి ధైర్యాన్ని అందించాలని కోరుకుంటున్న.” అని బాబర్ ఆజాం చేసిన ట్వీట్ రిప్లైఇస్తూ అన్నాడు.