
అఫ్గనిస్తాన్ కాబూల్ లో ఉన్న గురుద్వారా పై ఇస్లామిక్ టెర్రరిస్టుల బాంబు దాడి.. దానిలో ఎంత మంది ఉన్నారో వివరాలు తెలియలేదు. అక్కడ సిక్కులను ఈ దేశంలో ఉండదలిస్తే “సున్నిలు గా” మారండి లేకపోతే అగ్గనిస్తాన్ విడిచిపోండి అని ఇస్లామిక్ తీవ్ర వాదులు బెదిరించారు. గమనించండి. అక్కడ షియా ముస్లిమ్స్ ని అలా బెదిరించి నట్లు వార్తలు రాలేదు.
పంజాబ్ లో ఉన్న సిక్కు సంస్థ శిరోమణి ప్రబంధక్ కమిటీ వారు పంజాబ్ ముఖ్యమంత్రి కి ప్రధాని మోడీకి అగ్గనిస్తాన్ లో చిక్కుకుపోయిన మిగిలిన సిక్కులను రక్షించమని విజ్ఞప్తి చేశారు.
గతంలో జరిగిన ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను దృష్టిలో ఉంచుకుని మోడీ ప్రభుత్వం పాక్, ఆఫ్గన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో మత హింసకు గురి అవుతున్న అక్కడ మైనారిటీలు అయిన హిందూ, సిక్కు, క్రిస్టియన్, పారసీలు మొదలగు వారికి భారత పౌరసత్వం ఇద్దామని CAA చట్టం ద్వారా ప్రయత్నిస్తే ఈ సిక్కులే ఢిల్లీలో గొడవ చేస్తున్న ముస్లిమ్స్ కి నైతిక మద్దత్తు ఇచ్చి భోజనాలు అవి ఏర్పాటు చేశారు.
సరే మంచిదే. ఇప్పుడు భారత్ లో ఎన్ని ముస్లిం సంస్థలు ఈ గురుద్వారా బాంబు సంఘటనను ఖండించారు?
ఆఫగన్ ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారు?
ఇటువంటి ఆలోచనా విధానానికే నేను “ఉదార ఉన్మాదం” అని పేరు పెట్టాను. మన ఉనికే ప్రశ్నార్ధం అవుతుందేమో అనే పరిస్థితుల్లో కూడా నిజం ఒప్పుకోలేక ఇజానికి బలి అయిపోవడం.
~చాడా శాస్త్రి