బంగ్లాదేశ్ లో ఇస్కాన్ గురువు చిన్మోయి కృష్ణదాస్ అరెస్టు సందర్భంగా పెద్దదుమారం చెల రేగింది. ఆయన విడుదల చేయాలి అన్న డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. ఇస్కాన్ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రజలకు పెద్ద ఎత్తున చేస్తున్నాయి.
ఈ సందర్భంగా ఇస్కాన్ గురించి కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం. ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. దీనిని 1966లో శ్రీల ప్రభుపాద స్థాపించారు. ఆయన కోల్కతాలో జన్మించారు. తనకున్న అపార శ్రీకృష్ణ భక్తిని పరివ్యాప్తం చేస్తూ 1965లో హరే కృష్ణ ఉద్యమాన్ని ప్రారంభించారు. భగవద్గీతతో పాటు వేద గ్రంథాలలోని ఆధ్యాత్మికతను, భక్తిని వ్యాప్తి చేయడమే హరే కృష్ణ ఉద్యమ లక్ష్యం.
ఆ తర్వాత ఇస్కాన్ ఉద్యమం అన్ని వైపులా వ్యాపించింది.
శ్రీల ప్రభుపాద ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత ‘హరే కృష్ణ, హరే రామ్’ అంటూ శ్రీకృష్ణ భక్తిని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వెయ్యికిపైగా ఇస్కాన్ దేవాలయాలు ఉన్నాయి. వీటిలోని కొన్ని ఆలయాలు అక్కడి వాస్తుశిల్ప కళకు ప్రసిద్ధి చెందాయి. లండన్, బెర్లిన్, న్యూయార్క్లలో లెక్కకు మించిన కృష్ణ భక్తులు కనిపిస్తారు. వీరిలో చాలామంది క్రమం తప్పకుండా ఇస్కాన్ను సందర్శిస్తారు. ఇస్కాన్ దేవాలయాల్లో మనోహరమైన రాధాకృష్ణుల విగ్రహాలు కనిపిస్తాయి.
ఇస్కాన్ ఆలయాలలో భక్తితత్వం ప్రధానమైనది.
ఇస్కాన్ ఆలయాల్లో ప్రతి రోజూ హరినామ సంకీర్తన జరుగుతుంది. ఆలయానికి వచ్చే భక్తులకు ఉచితంగా ప్రసాదం అందజేస్తారు. ఇస్కాన్ దేవాలయాలలో శ్రీమద్ భాగవతం, భగవద్గీతలపై బోధనలు ఉంటాయి. శుచి శుభ్రతకు ఈ ఆలయాలు పెట్టింది పేరు.
బంగ్లాదేశ్ లోనే కాకుండా అనేక చిన్న దేశాలలో ఇస్కాన్ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతుంది. వరదలు భూకంపం అగ్ని ప్రమాదం అంటే విపత్తులు వచ్చినప్పుడు ఇస్కాన్ కార్యకర్తలు అన్నదానం వస్తుదానం పెద్ద ఎత్తున చేస్తుంటారు.