ఈ దేశంలో కాంగ్రెస్ ,కమ్యూనిస్టులు ,ప్రాంతీయ పార్టీ ల పోకడలు గమనిస్తే భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎట్లా పనిచేస్తున్నది దేశసమగ్రత ,దేశాభివృద్ధిలో వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉన్నాయో తెలుస్తుంది . ఈ మధ్య కాంగ్రెస్ లో మకుటం లేని మహారాజు గ వెలుగొందుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేసాడు యాత్రలో రాహుల్ మాట్లాడిన మాటలు చూస్తే దేశస్వాతంత్ర పోరాటకాలంనుండి సాగుతున్న మైనారిటీ అనుకూల వాదనలే మళ్ళీ మళ్ళీ వినిపించటమే ఆ యాత్ర లక్ష్యం గా కనిపిస్తోంది. జోడో యాత్ర ముగింపు సందర్భంగా ‘’కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర ప్రతిపత్తిని ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. రాజ్యాంగ అధికరణ 370 సహా కశ్మీరుకు సంబంధించిన రాజకీయ అంశాలను తిరగతోడేందుకు కాంగ్రెస్ సుముఖంగా ఉన్నదని’’ రాహుల్ చేసిన ప్రకటన చెప్పకనే చెప్పింది. అట్లాగే.ఫిబ్రవరి 24 నుండి 26 వరకు చత్తీస్ ఘడ్ రాజధాని రాయపూర్ లో కాంగ్రెస్ అఖిలభారత అధివేషన్ జరిగింది. దానిలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ” కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆర్ఎస్ఎస్ వాదులను ఏరివేసి పార్టీ ప్రక్షాళన చేయాలని పిలుపునిచ్చాడు, దానికి ఉదాహరణగా పార్లమెంటులో వీర సావర్కార్ విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు కాంగ్రెస్ నేతలైన ప్రణబ్ ముఖర్జీ, శివరాజ్ పాటిల్ దానిని సమ్ర్ధించారని అది కాంగ్రెస్ విధాననిక్ వ్యతిరేకమని ‘’ప్రస్తావించారు, వీరసావర్కర్ అంటే హిందూ మత తత్వవాది అతని విగ్రహాన్ని పార్లమెంటులో ప్రతిష్టించడం అంటే లౌకికవాదానికి విరుద్ధం అనేది రాహుల్ వివరణ. అంటే కాంగ్రెస్ పరంపరాగత ఇస్లాం సంరక్షణ వాదానికి అది వ్యతిరేకం కాబట్టి ఇటువంటి వాళ్లను పార్టీ నుంచి తొలగించాలి అని రాహుల్ గాంధీ పిలుపు .అంటే దానిసారాంశము దేశవిభజన, దశాబ్దాలుగా కాశ్మీర్ రావణ కాష్టం గా మారటానికి దారితీసిన పరిస్థితులను తిరగ తోడాలని భావించటమేనా? దినిని బట్టి కాంగ్రెస్ కు దేశ సమగ్రతవిషయం లో ఉన్న మౌలిక ఆలోచనలలో 122 సంవత్సరాలుగడిచినా పెద్ద మార్పు ఏమి రాలేదని అర్ధమౌతున్నది. మైనారిటీలు కాంగ్రెస్ కు 1992 నుండి క్రమంగా దురమోటు వస్తున్నారు ,దేశం లో మారుతున్న పరిస్తితులలో వాళ్ళు కూడా మారుతున్నారు , అట్లాగే దేశం లోని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ ను అర్ధం చేసుకోవటం లో వస్తున్న మార్పులను కాంగ్రెస్ గ్రహించటం లేదు అనేది రాహుల్ భారత్ జోడో యాత్ర ముగింపు మనకు అర్ధం చేయిస్తున్నది దానిని ఒకసారి గమనిద్దాము
‘’రాహుల్ గాంధీ జోడో యాత్ర సమాప్తి సందర్భంగా దాదాపు 24 ప్రతిపక్ష పార్టీలను ఆహ్వానించినా అరడజనుపార్టీలు కూడా రాలేదట! రాహుల్‌ని సమష్టి నాయకుడిగా ఒప్పుకోవటానికి ప్రతిపక్షాలు అన్నీ సిద్ధంగా లేవన్నది స్పష్టం. స్టాలిన్, ఉద్ధవ్ థాక్రే లాంటి కొందరు నాయకులు కాంగ్రెస్‌తో జతకడితే కట్టవచ్చు, కానీ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాత్రం తన ఒకనాటి మాతృసంస్థకు దూరంగానే ఉండిపోతున్నారు. ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్ ఎటూ మొగ్గటం లేదు. జగన్ సింగిల్ గా ఉండే దాఖలాలే కనపడుతున్నాయి. పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్‌తో కలిసి అధికారాన్ని హస్తగతం చేసుకొనే పనిలో ఉండటం వల్ల జాతీయ స్థాయిలో ఎవరితోనూ అంటకాగటం లేదు.దీనిని బట్టి కాంగ్రెస్ నాయకత్వాన్ని అందరూ అంగీకరించటం లేదు అనేది స్పస్టమౌతున్నది.’’
అట్లాగే రాహుల్ లండన్ పర్యటనలో మాట్లాడినా మాటలు కూడా చూద్దాము. వరుస ఓటములతో నిరాశ, నిస్పృహలకు లోనైనా రాహుల్ గాంధీ లండన్ లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రసంగిస్తూ మాట్లాడిన మాటలు కేంద్రంలోని ప్రభుత్వాన్నిగద్దె దింపేందుకు తన శక్తి సరిపోవటం లేదని అంగీకరిస్తూనే తమ పార్టీ మైనార్టీ రక్షణకు కట్టుబడిఉన్నదని చెప్పేందుకు ప్రయత్నించాడు దేశంలో మైనార్టీ లకు భద్రత లేదని దాడి చేసాడు. దేశం గౌరవ ప్రతిష్టలు మసకపరచే పని లక్ష్యం గా పెట్టుకున్నట్లు కన బడుతున్నది. మొత్తం మీద గాంధీ, నెహ్రు వారసత్వం నిర్వాకం, మరియు కాంగ్రెస్ పార్టీ రెండు కలగలిసి తమ పతనానికి దారిని తామే సుగమం చేసుకొంటున్నారు.
కేంద్రం లో ప్రభుత్వాన్ని దించటం సాద్యమా?
ఉదర వాదమేధావులు నిరాశ నిస్పృహ లతో మాట్లాడుతున్న మాటలు కూడ చూద్దాం ‘’ దేశంలో జాతీయ స్థాయిలో ప్రతిపక్షకూటమి ఏర్పడి మోదీ అధికారాన్ని సవాలు చేసే పరిస్థితి కనుచూపుమేరలో లేదు. అభిజాత్యాలు పక్కనపెట్టి, మమత, కేజ్రీవాల్, రాహుల్, నితీశ్, అఖిలేశ్, మాయావతి, స్టాలిన్, ఉద్ధవ్, శరద్ పవార్, ఫరూఖ్ అబ్దుల్లా లాంటి నాయకులంతా ఏకమై, కమ్యూనిస్టులను గూడా కలుపుకొని పోయి ఎమర్జెన్సీ అనంతర జనతా పార్టీ తరహాలో ఒక ఫ్రంట్‌గా ఏర్పడాలని కొందరు పిలుపునిస్తున్నారు’’ , కానీ వాస్తవాలు చూస్తే అప్పటి పరిస్తితులు వేరు అవసరాలు వేరు . ఇందిరా గాంధీ హయాం లో లాగా దేశంలో ఇప్పుడు ఎమర్జెన్సీ ఏమి లేదు ,నియంతృత్వ పాలన ఉన్నదా అంటే అది లేదు, పైగా ప్రాంతీయ పార్టీ లు కమ్యూనిస్టులు ఉన్నదగ్గర నియంతృత్వ పాలనా ఉన్నది. కాబట్టి దేశం లో రావలసిన మార్పు ప్రాంతీయ పార్టీలు ఆలోచించే తీరు లో అమార్పు దేశం లో ఏమైనా కనబడుతున్నదా? అంతగలేదు అనే అర్ధమౌతున్నది. ఎందుకంటే తమ ధికారం నిలబెట్టుకోవడానికి ఆలోచించ టానికే వాళ్లకు సమయం సరిపోవటం లేదు ఇంకాదేశం గురించి ఏమి ఆలోచిస్తారు? దేశంలో ఎక్కడ విభేదాలు విమర్శలు ఉండకూడదో అక్కడే మన దేశంలో సిద్ధాంతాల సంఘర్షణ దశాబ్దాలుగా కొనసాగుతున్నది ,అట్లాగే ప్రపంచంలో ఎక్కడ లేనివిధంగా ముస్లిం జాతి అనే భావన మనదేశంలో బలం గాఉన్నది ,దాని కారణంగానే దేశం, జాతి, సంస్కృతీ విషయాలలో భిన్న ఆలోచనలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడే ఒక విషయం గమనించాలి.
దేశం ఎదుర్కొంటూన్న అసలు సమస్య ఏమిటి ?
భారతదేశంలో ప్రస్తుతం జరుగుతున్న అసలైన యుద్ధం రాజ్యాధికారం ద్వారానే దేశం పునర్నిర్మాణం జరుగుతుంది అనే ఆలోచనలతో పని చేస్తున్న వారికి, దేశ పునర్ నిర్మాణం లో రాజ్యశక్తి ఉండాలి కానీ అది సర్వోపరి కాదు ధర్మము, సంస్కృతి కీలకము, అనే వారికి మధ్య జరుగుతున్నది, దేశ పునర్ నిర్మాణం అనేది దేశంలో ధర్మము సంస్కృతి ఆధారంగా సామాజిక, ఆధ్యాత్మిక శక్తిని నిర్మాణం చేయటమే కీలకము. ఈ పని చేస్తున్న ఆర్ఎస్ఎస్ ను ఈ శక్తులన్నీ మతతత్వ శక్తిగా ముస్లింలకు వ్యతిరేకమని విపరీతమైన ప్రచారం చేసుకుంటూ వచ్చారు, సంఘం పై ఇట్లా అనేక దుష్ప్రచారాలు దశాబ్దాలుగా చేసుకుంటూ వస్తూ వస్తూ ఆ శక్తులన్నీ బలహీనపడటం ఈ రోజున దేశంలో స్పష్టంగా కనపడుతున్నది, దానిని జీర్ణించుకోలేని ఉదార మీడియా హిందుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నది, మతతత్వ శక్తులుగా మతం మార్పిడులతో ప్రపంచాన్ని మార్చేయాలని కుట్రలు పన్నుతు నెంబర్ గేమ్ నడిపిస్తున్న ఇస్లాం, క్రైస్తవుల గురించి ఒక్కమాట మాట్లాడటం లేదు అట్లాగే ఏక వ్యక్తి నియంతృత్వంలో ఉన్న చైనా ను కూడా ఏమి అనటం లేదు. ఎందుకోసం? ప్రపంచంలోని బిబిసి లాంటి మీడియా సంస్థలు, భారత్ లో ని ఉదార వాద మీడియా హిందూ సంస్కృతిని ఎందుకు ధ్వంసం చేయాలని కంకణం కట్టుకున్నాయి? దానికి కారణాలు ఏంటి? ఎందుకంటే ప్రపంచంలో మిగిలి ఉన్న పురాతన సంస్కృతి కేవలం హిందూ సంస్కృతి మాత్రమే, అది భారతదేశంలో సజీవంగా ఉంది, మిగిలిన పురాతన సంస్కృతులు అన్నీ కూడా ఇస్లాం, క్రైస్తవం, కమ్యూనిజం ల పదఘట్టనల కింద నలిగిపోయి నామరూపాలు లేకుండా పోయాయి, ప్రపంచాన్ని తిరిగి శాంతి వైపు నడిపించగలిగే శక్తి కేవలం హిందూ ఆధ్యాత్మిక విలువలకు మాత్రమే ఉన్నదని ప్రపంచ మత మహాసభల్లో వివేకానందుడు ఇచ్చిన సందేశం ప్రపంచవ్యాప్తంగా వెళ్లిపోయింది, కాబట్టి ఆ ఆలోచనలు ప్రపంచాన్ని ప్రభావితం చేయటం తమ ఆధిపత్యానికి అడ్డం అని ఇస్లాం క్రైస్తవం కమ్యూనిజం పెట్టుబడిదారీ శక్తులు భావిస్తున్నాయి , కాబట్టి భారతదేశాన్ని బలహీనం చేయటము అంటే హిందూ సాంస్కృతిక శక్తిని బలహీనం చేయాలి , ఆ లక్ష్యంతో పనిచేస్తున్నారు. దానితో అంట కాగి వంతపాడేవాళ్లు, మన దేశంలో ఉండే లిబరల్ మేధావులు, లిబరల్ మీడియా పనిచేస్తోంది కాబట్టి ఇటువంటి శక్తులను కట్టడిలో ఉంచడమే ఈ రోజున హిందూ సమాజం ముందు ఉన్న ఒక పెద్ద సవాలు, ఆ సవాలను స్వీకరించి సమాజం జాగృతం కావాలి., హిందూ సంస్కృతి, ధర్మ సంరక్షణ ప్రపంచశాంతికి బాటలు వేస్తుంది అనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేయటం హిందువులుగా మన అందరి కర్తవ్యం. ఈ దిశలో ఈ రోజున దేశంలో జరుగుతున్న రాజకీయ గందరగోళాలు దుమారాలు ఈ దృష్టి కోణం నుంచి మనం ఆలోచించినప్పుడే సత్యాసత్యాలు మనకు అర్థమవుతాయి, కాబట్టి జాగృతంగా ఉండవలసిన అవసరం గతం కంటే ఇప్పుడు చాలా చాలా ఎక్కువగా ఉన్నది అనేది దేశంలో నిర్మాణం అవుతున్న పరిస్థితులు మనకు అర్థం చేస్తున్నాయి ఈ విషయాలను గమనిస్తూ మనం పని చేయాలి
రాజకీయాలను ప్రజలే ఎట్లా నడిపించాలో నేర్చుకోవటం కి శ్రీకారం పడుతున్న దా ?
ఇది ఒకే దేశం ఒకే జాతి ఒకే సంస్కృతి అనిచెప్పే RSS ,మతతత్వశక్తి గా ముస్లిం వ్యతిరేకిగా మాట్లాడుతుంటారు , దశాబ్దాలుగా దేశమంతా హోరెత్తించారు కానీ ఈరోజు rss దేశానికీ కేంద్ర శక్తి గ మారుతున్నది ,హిందుత్వం అంటే భారతజాతీయత అనే విషయం దేశమంతా క్రమంగా గుర్తుస్తున్నారు , రాజకీయాల అలజడులుకూడా స్వరాలూ తగ్గించి మాట్లాడుతున్నాయి. రాజకీయాలే సర్వస్వం అనుకునేవారు కూడా స్వరం మారుస్తున్నారు .
ఈ దేశంలో వస్తున్నా మార్పు.ఆ మార్పు పై ఒక కీలక వ్యాఖ్యానం చూద్దాము.
దేశంలో ఎన్నికల రాజకీయాలలో ఉన్న ప్రతిపక్ష రాజకీయశక్తులన్నిటికి సిద్ధాంతబలం, నైతికశక్తి లోపించడమే ఇప్పటి సమస్య. ఒక విశ్లేషక మేధావి ప్రశ్నించినట్టు, 2024 ఎన్నికల మీదనే ఎందుకు ఇంత గురి, ఇంత బాధ్యత? ఎన్నికల మీద మాత్రమే ఆశలు పెట్టుకుంటే నిరాశే ఎదురవుతుంది. సమస్త ప్రజారంగాలలోనూ ప్రతిఘటనను నిర్మించడమే నికరమైన ఫలితాలను ఇస్తుంది. అలాగని, ఎన్నికల కీలకత్వాన్ని తగ్గించలేము. ప్రభుత్వ విధానాల మీద ఏదో ఒకనాటికి ప్రజలలో విముఖత పెరుగుతుందని, అప్పుడు ఆ వ్యతిరేకతను లబ్ధిగా మార్చుకోవచ్చునని చూడడం ప్రతిపక్షాలకు అలవాటయింది. ప్రభుత్వ వ్యతిరేకతను నిర్మించే పని కూడా ప్రతిపక్షాలు చేయవు. వివిధ ప్రజారంగాలలో ఉన్న ప్రజాస్వామిక వాదులు భావప్రచారాన్ని, ఉద్యమాలను చేయడం వల్ల ప్రజలలో చైతన్యం కలగడమే కాకుండా, ప్రతిపక్షాలలో కూడా కదలిక సాధ్యపడుతుంది.
గడచిన సంవత్సరంలో కీలకమయిన ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో బిజెపి రెండోసారి ఘనవిజయం సాధించింది. గుజరాత్లో మెరుగైన ఘనవిజయం పొందింది. హిమాచల్ ప్రదేశ్‌లో, ఢిల్లీ స్థానిక సంస్థలలో ప్రతిపక్షాలు గెలిచాయి. బిహార్‌లో నితిశ్ కుమార్ భాగస్వామ్యపార్టీని మార్చి, ప్రతిపక్షశిబిరంలోకి ఫిరాయించారు. పట్టుదల ఉన్నవారు జయాపజయాల నుంచి తగిన సందేశాన్ని అందుకుంటారు. అమృతోత్సవం హడావుడి త్వరలోనే చల్లారిపోయింది. చరిత్రపై యుద్ధం సాగుతూనే ఉన్నది. అన్నిటికంటె పెద్ద పరిణామం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తలపెట్టిన జోడో యాత్ర. ఆచరణాత్మక ఫలితాల కంటె ఆదర్శ ప్రకటనే ఎక్కువ ఉన్నదని పెదవి విరుస్తున్నవారున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీకి, తనకూ కూడా పేరు ప్రతిష్ఠలను పెంచగలిగిన కార్యక్రమం అది అని భావిస్తున్నారు . అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ కూడా ఎంతో కొంత మాట్లాడడం మొదలుపెట్టారు. ఇన్ని జరుగుతున్నా, ప్రతిపక్షాలను ఒక గీత మీదకో, ఒక వృత్తంలోపలికో తీసుకువచ్చే ప్రయత్నాలు జరగడం లేదు. న్యాయప్రక్రియలో జీవం పోసుకుంది. ఉమ్మడి పౌరస్మృతి ప్రయత్నాలు మొదలయ్యాయి. పాలకయంత్రాంగంతో గట్టిగా వ్యవహరిస్తున్నప్పటికీ, అనేక కీలక అంశాల మీద న్యాయవ్యవస్థ స్పందనలు ఎట్లా ఉంటాయన్నది ఊహించలేము. జాతీయ మీడియా కూడా విశ్వసనీయతను కోల్పోయిన స్థితిలో, ప్రజాస్వామ్యంలో కొనవూపిరితో మిగిలిన ఒంటి స్తంభంగా భావిస్తున్న న్యాయవ్యవస్థ తీసుకోగలిగే బాధ్యతభారానికి పరిమితులుంటాయి. పరిస్థితుల క్రమాన్ని మార్చాలన్న సంకల్పం ప్రజలలో వ్యక్తమైతే తప్ప, ఒక్కొక్క ప్రజాస్వామిక వ్యవస్థా కోలుకోవడం మొదలుకాదు. అయితే, మోహరించిన బలగాలలో సమతూకం లేదు. బహుముఖాలుగా, బాహుబలి పనిచేస్తున్నప్పుడు, ప్రత్యామ్నాయంగా వ్యవహరించవలసిన వారు చీలికలు పేలికలుగా ఉన్నారు. అనేక ప్రాంతీయ పార్టీలకు సొంతదృష్టి తప్ప, దూరదృష్టి లేదు, రాజనీతి లేదు. ఎవరికి వారు స్వచర్మరక్షణార్థం ప్రయత్నించడమే తప్ప, కట్టుగా ఉండడం, జట్టు కట్టడం మీద నమ్మకం లేదు.అని మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితుల రావటం కి కారణాలు మైనార్టీల ఓట్లకోసం సాగించిన వేట బెడిసికొట్టటం ,మరోప్రక్క మైనార్టీ ల ఆలోచనలలో కూడా మార్పులు రేఖా మాత్రంగా కనబడటం మరో కీలక పరిణామం . రాబోవు రోజులలో దేశం లోసామాజికంగా కూడా మార్పులు చోటుచేసుకోవచ్చు అని అందరికి అర్ధమౌతున్నది. మొత్తం మీద రాబోవు రోజులలో రాజకీయాలను ప్రజలే ఎట్లా నడిపించాలో నేర్చుకోవటం కి శ్రీకారం పడుతున్నది దీనిని అందరం స్వాగతించలి.