ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అస్థిర పరిస్థితులు, యుద్ధ మేఘాల నేపథ్యంలో భారతదేశం తన భద్రత విషయంలో అత్యంత అప్రమత్తమైంది. సరిహద్దుల్లో పొంచి ఉన్న ముప్పును పసిగట్టిన కేంద్ర ప్రభుత్వం, ఎటువైపు నుంచి దాడి జరిగినా దీటుగా తిప్పికొట్టేలా సైన్యాన్ని సర్వసన్నద్ధం చేస్తోంది. కేవలం రక్షణ కోసమే కాకుండా, అవసరమైతే శత్రువులను వారి ఇలాకాలోనే దెబ్బతీసేలా అత్యాధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటూ భారత్ ప్రపంచ వేదికపై శక్తివంతమైన దేశంగా ఎదుగుతోంది.
…………………………….
ఈ భారీ రక్షణ వ్యూహం వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్భుతమైన దార్శనికత స్పష్టంగా కనిపిస్తోంది. దేశ భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదనే లక్ష్యంతో ఆయన రక్షణ రంగానికి పెద్దపీట వేశారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ పిలుపుతో ఒకవైపు స్వదేశీ ఆయుధ తయారీని ప్రోత్సహిస్తున్నారు. మరోవైపు అత్యవసర అవసరాల కోసం ప్రపంచంలోనే మేటి సాంకేతికతను భారత్కు రప్పించడంలో ఆయన సఫలీకృతమయ్యారు. వివిధ దేశాలలో పర్యటించి స్నేహ సంబంధాలు ఏర్పరచుకోవటం ద్వారా.. అగ్రశ్రేణి ఆయుధాలు అందేలా చేస్తున్నాయి.
…………………………….
ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా నిలుస్తోంది. వాయుసేన బలాన్ని పెంచేందుకు ఫ్రాన్స్ నుంచి సుమారు 140 అత్యాధునిక యుద్ధ విమానాలను తీసుకొంటున్నారు. అలాగే నౌకాదళం కోసం జర్మనీ నుంచి శక్తివంతమైన జలాంతర్గాములను తెప్పిస్తున్నారు. సుదీర్ఘ కాలంగా మిత్రదేశంగా టెక్నాలజీ ని రష్యా అందిస్తోంది. రాఫెల్ విమానాలతో ఫ్రాన్స్ అండగా నిలుస్తోంది. డ్రోన్లు మరియు క్షిపణి సాంకేతికతతో ఇజ్రాయెల్ సహకరిస్తోంది. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాత్మక భాగస్వామ్యాల వల్ల ఈ దేశాలన్నీ భారత్కు సాంకేతికతను బదిలీ చేసేందుకు కూడా మొగ్గు చూపుతున్నాయి.
……………………………………
ముఖ్యంగా చైనా, పాకిస్థాన్లతో సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఆయుధ సేకరణ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. హిమాలయ పర్వతాల నుంచి హిందూ మహాసముద్రం వరకు భారత్ తన నిఘాను, రక్షణను కట్టుదిట్టం చేసింది. ఏకకాలంలో రెండు సరిహద్దుల వద్ద యుద్ధం వచ్చినా ఎదుర్కోగల సామర్థ్యాన్ని భారత్ ఇప్పటికే సంతరించుకుంది.
……………………………….
మొత్తానికి, ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ఒక శాంతి ప్రియ దేశంగా ఉంటూనే, తన ఆత్మగౌరవానికి భంగం కలిగించే శక్తులను అణిచివేసేందుకు సిద్ధంగా ఉంది. స్వదేశీ తయారీ మరియు విదేశీ దిగుమతుల కలయికతో భారత్ నేడు రక్షణ రంగంలో ‘విశ్వగురువు’గా అవతరిస్తోంది.



