ఐపీఎస్ అధికారి, తెలంగాణ గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. స్వచ్ఛంద పదవీ విరమణ కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ఆర్ఎస్ ప్రవీణ్ లేఖ రాశారు. ఈ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈమెయిల్ చేసినట్లుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 26 ఏళ్లుగా విధుల్లో ఉన్నానని వ్యక్తిగత కారణాల వల్ల స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలనుకుంటున్నానని పేర్కొంటూ ఓ లేఖ విడుదలచేశారు.
ఇకపై, తన మనసుకు ఇష్టమైన, నచ్చిన పనులను చేయబోతున్నట్లు ప్రకటించాడు. తన శేష జీవితం మొత్తం సమాజ సేవకే అంకితం అనీ పేర్కొన్నారు.
స్వోరో సుప్రీంగానూ ఉన్న ఆయనపై కొన్నేళ్లుగా విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే హిందుదేవుళ్లను వ్యతిరేకిస్తూ ఆయన చేసిన ప్రతిజ్ఞా వివాదాస్పదమైంది. పలువురు కేంద్రానికీ ఫిర్యాదు చేశారు..సంక్షేమ హాస్టళ్లు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయంటూ స్వేరోపేరుతో ఇష్టారాజ్యం సాగిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తిన ఈ నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ ప్రకటించారు.