తనపై అంతర్జాతీయంగా కుట్ర జరుగుతోందని ఆరోపించింది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. తన ఇన్ స్టా అకౌంట్ ను చైనా హ్యాక్ చేసిందని, తాలిబన్లపై తాను చేసిన పోస్ట్ కనిపించడంలేదనీ వాపోయింది. ‘రాత్రి చైనావాళ్లు నా ఖాతాను హ్యాక్ చేసినట్టు అలర్ట్ మెసేజ్ వచ్చింది. ఉదయం తాలిబన్లపై నేను పెట్టిన పోస్ట్ కనిపించలేదు. కాసేపటికే నా అకౌంట్ మాయమైంది. ఇన్ స్టాగ్రామ్ నిర్వాహకులకు ఫిర్యాదుచేశాక అప్పుడు యాక్టివేట్ అయింది’ అని ఆమె వివరించింది. గతంలోనూ కంగనా సోషల్మీడియా అకౌంట్లు హ్యాకయ్యాయి. ట్విట్టర్ ఆమె ఖాతాను బ్యాన్ చేసింది.