విజయవాడలో హైందవ శంఖారావం ఎంత సంచలనం అయిందో,, సినీ రచయిత అనంత శ్రీరామ్ పేరు కూడా అంతే పాపులర్ అయ్యింది. లక్షల మంది హిందూ బంధువుల్లో ఆలోచనలు రేకెత్తే విధంగా ఆయన ప్రసంగించారు. హిందూ సమాజంలో చైతన్యం తెచ్చేందుకు ఆయన చేసిన ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంది. దీంతో అనంత శ్రీరామ్ ఎవరు అంటూ అంతా ఆరా తీస్తున్నారు.
…….
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు సమీపంలోని దొడ్డి పట్ల అనే చిన్న గ్రామంలో అనంత శ్రీరామ్ జన్మించారు. 10, 12 సంవత్సరాల వయసు నుంచి పాటలు కవితలు రాయడం అలవాటు చేసుకున్నారు. అక్కడ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో చదవడం ద్వారా జాతీయవాదం ఆయన లో ప్రవేశించింది. ఆ తర్వాత నుంచి ఆయన అదే బాటలో కొనసాగుతూ వచ్చారు. ఇప్పటికీ శిశు మందిర్ ముద్దుబిడ్డను అని ఆయన చెప్పుకుంటూ ఉంటారు.
….
అనంత శ్రీరామ్ కుటుంబ సభ్యులు రాజకీయ పార్టీలలో పేరు మోసిన వాళ్ళు. అందుచేత ఆయన ఆస్తిని కాజేసేందుకు దగ్గర బంధువులే ప్రయత్నం చేశారు. నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్లి చిన్నతనంలోనే తొడగొట్టి సవాల్ చేసిన పౌరుషం అనంత శ్రీరామ్ ది. అప్పట్లో ఆయన బాబాయి ఒకరు మంత్రిగా పనిచేస్తున్నప్పటికీ అనంత శ్రీరామ్ ఏమాత్రం తగ్గలేదు..
………..
సినిమా రంగం పట్ల అభిరుచితో పెన్ను చేత్తో పట్టుకొని అనంత శ్రీరామ్ ఫిలింనగర్ ప్రవేశం చేశారు.మొదటిసారిగా “కాదంటే ఔననిలే” చిత్రంలో అవకాశం లభించింది. 2006లో హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. 2014 వరకు 200 సినిమాలకు పాటలు అందించారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన అందరివాడు సినిమాతో బాగా గుర్తింపు వచ్చింది. సిరివెన్నల సీతారామశాస్త్రి పాటలు అంటే శ్రీరాం కి ఇష్టం.
……..
సినిమా పాటల్లో సైతం చక్కటి సాహిత్యాన్ని సృష్టించడం అనంత శ్రీరామ్ కు అలవాటు. అందుచేతనే ఆయన పాటలు చాలా వరకు అర్థవంతంగా ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇంతటి ప్రతిభా మూర్తి కాబట్టి ఆయన్ని వెతుక్కుంటూ అనేక అవార్డులు వచ్చాయి.
2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉగాది సందర్భంగా కళారత్న పురస్కారం అందుకొన్నారు.
అప్పట్లోనే … ఎటో వెళ్లిపోయింది మనసు… అన్న సినిమాలో
కోటి తారల్లోనా ..పాట రచించారు . ఈ పాటకు ఉత్తమ నంది పురస్కారం లభించింది.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అద్భుతమైన పాటలు అందించినందుకు ప్రతిష్టాత్మక సైమా అవార్డు అందుకున్నారు .
మొదటనుంచి హైందవ భావం అన్నా,, హిందుత్వం అన్నా … అనంత శ్రీరామ్ కి చాలా ఇష్టం. చాలామంది సినిమా ప్రముఖులు ఈ ఆలోచన చేస్తారు కానీ ,, బయటపడేందుకు ఇష్టపడరు. కానీ అనంత శ్రీరామ్ మాత్రం బహిరంగంగానే హిందుత్వం గురించి ప్రకటిస్తారు.
కెరీర్,, సంపాదన కన్నా దేశం, ధర్మం ముఖ్యం అనేది ఆయన భావన. అందు చేతనే మొన్నటి హైందవ శంఖారావం కార్యక్రమం లో కుండ బద్దలు కొట్టి మాట్లాడేశారు.
…….
సినిమా రంగంలో పేరు మోసిన రచయిత అయినప్పటికీ అనంతశ్రీరామ్ లో దర్పం ఏమాత్రం కనిపించదు. హైదరాబాద్ మణికొండలో సాయంకాలం వేళల్లో ప్రశాంతంగా వాకింగ్ చేస్తూ స్థానికులతో కలిసిపోతూ ఉంటారు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే లక్షణం అనంత శ్రీరామ్ సొంతం,, రాగల కాలంలో ఆయనకు మరింత ఖ్యాతి లభించడం తథ్యం.