అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్టైన బైరి నరేష్ తన నేరం ఒప్పుకున్నాడు. ఉద్దేశపూర్వకంగానే ఆ వ్యాఖ్యలు చేసినట్టు అంగీకరించాడు. ఉద్దేశపూర్వకంగానే డిసెంబర్ 19నాటి ఆ కార్యక్రమానికి పిలిచినట్టు కార్యక్రమ నిర్వాహకుడు హన్మంతు సైతం పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. అతనిపై పోలీసుల రిమాండ్ రిపోర్ట్ మీడియాకు చిక్కింది. అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా అయ్యప్పస్వామిపై నరేష్ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అతనిపై గతంలోనూ పలు కేసులున్నాయని పోలీసులు కోర్టుకు తెలిపారు. నలుగురు ప్రత్యక్ష సాక్షుల నుంచి పోలీసులు స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు.