
Supreme Court of India
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుపై విచారణను సుప్రీం కోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. తమకు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ రామచంద్రభారతి సహా ముగ్గురు నిందితులు సుప్రీంకు వెళ్లారు. పిటిషన్ ను స్వీకరించిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. ఈ సందర్భంగా సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయాలకు వేదికగా కోర్టును వాడుకోవడం సరికాదని హితవు పలికింది. ముఖ్యంగా తెలంగాణ, ఏపీ నుంచి వచ్చే కేసులు ఎక్కువ రాజకీయపరంగా ఉంటున్నాయని కోర్టు అభిప్రాయపడినట్టు తెలిసింది.