భారతీయులు అంతా ఇష్టపడే క్రీడగా క్రికెట్ ను చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా భారత్ లో ఉన్నంత క్రేజ్ వేరే దేశంలో ఉండదు అని అనుకోవచ్చు. అందుకే క్రికెట్ మ్యాచ్ అన్న, క్రికెట్ వ్యవహారాలు అన్న భారతీయులకు ఆసక్తిగా ఉంటుంది.
అంతర్జాతీయ క్రికెట్ మండలి కి జై షా అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు అయిన జై షా కొంతకాలంగా భారత్ క్రికెట్ బోర్డుకి అధ్యక్షుడిగా ఉన్నారు.
ప్రస్తుత అధ్యక్షుడు గ్రెగ్ బార్క్లే స్థానంలో 2024, డిసెంబర్ ఒకటి న నూతన చైర్మన్‌గా జై షా బాధ్యతలు చేపట్టనున్నాడు.ఐసీసీ చైర్మన్‌గా నామినేట్ అవ్వడంపై షా సంతోషం వ్యక్తం చేశాడు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన చెప్పారు.
‘ఐసీసీ చైర్మన్‌గా నామినేట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఐసీసీ బృందం, సభ్య దేశాలతో కలిసి క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేసేందుకు కట్టుబడి ఉంటాను. క్రికెట్లోని ఫార్మాట్ల మధ్య సమన్వయం దెబ్బతినకుండా చూసేందుకు అవసరమైతే సరికొత్త సాంకేతికతను అందుబాటలోకి తెస్తాం. ఇదివరకూ లేనంతగా క్రికెట్‌ను అంతటా విస్తరింపచేయడమే మా లక్ష్యం’ అని తెలిపారు.
2028లో లాస్ ఏంజెల్స్‌లో జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టడం ఈ ఆట అభివృద్ది పరంగా గొప్ప విప్లవాత్మకమైన నిర్ణయం అని చెబుతూ దాంతో, క్రికెట్ మరింత పురోగతి చెందుతుందనే నమ్మకం తనకుందని షా వెల్లడించాడు.
మొదట నుంచి క్రికెట్ మీద జైషా ఆసక్తి చూపిస్తూ వచ్చారు. మొదట 2019 అక్టోబర్‌లో బీసీసీఐ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాడు. అప్పటి నుంచి ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నాడు. 2021 జనవరి నుంచి ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్‌గానూ షా సేవలందిస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఐసీసీ చైర్మన్‌గా ఎంపికైన నేపథ్యంలో తదుపరి బీసీసీఐ సెక్రటరీ ఎవరు? ఏసీసీ చైర్మన్ అయ్యేది ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది.
గ్రెగ్ బార్క్లే పదవీ కాలం నవంబర్‌లో ముగియనుంది. ఇప్పటికే రెండు పర్యాయాలు ఈ పదవిలో ఉన్న గ్రెగ్ ఇక వైదొలగాలని భావిస్తున్నాడు. అందువల్ల కొత్త బాస్ ఎంపిక అనివార్యమైంది. ఐసీసీ చైర్మన్‌గా ఎన్నికైన ఐదో భారతీయుడిగా జై షా నిలిచారు.
అంతర్జాతీయ క్రికెట్ బోర్డు అధ్యక్షునిగా ఎన్నికైన వారిలో చిన్న వయసుకుడిగా జై షాను చెప్పవచ్చు.