సిరియా లో భారతీయులు క్షేమంగా ఉన్నారని విదేశాంగ శాఖ నిర్ధారణ చేసింది. ఈ మేరకు సిరియాలోని భారతీయ రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. సిరియాలో వివిధ విధులలో నిమగ్నమైన భారతీయులతో సంప్రదింపులు జరుపుతున్నామని,, అందరు క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నామని ఈ ప్రకటనలో వివరించారు.
అదే మాదిరిగా భారతదేశంలోని ప్రజానీకానికి సమాచారం అందిస్తున్నామని తెలియజేశారు. సిరియాలో చిక్కుకున్న భారతీయులకు
అవసరమయ్యే పూర్తి సహాయాన్ని అందిస్తూనే ఉన్నామని చెప్పింది.
సిరియాలో తిరుగుబాటు తీవ్రతరం అయిన సంగతి తెలిసిందే. ఇస్లామిస్ట్ నేతృత్వంలోని తిరుగుబాటుదారులు అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ పాలనను తొలగించినట్లు ప్రకటించడంతో సిరియాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాజధానిలో నాటకీయ మార్పుకు దారితీసింది.
సిరియాలో తీవ్రమైన హింసాకాండ దృష్ట్యా, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ భారతీయులకు ప్రయాణ సలహా సూచించింది. వీలైనంత త్వరగా సిరియా నుండి బయలుదేరాలని ఇప్పటికే సూచించారు. అక్కడ నుండి బయటకు వచ్చే మొదటి వాణిజ్య విమానాలను తీసుకెళ్లాలని సూచించినట్లు సలహా ఇచ్చింది. అలా చేయలేని వారికి కఠినమైన జాగ్రత్తల సిఫార్సు చేసింది. ప్రస్తుతం దాదాపు 90 మంది పౌరులు సిరియాలో ఉన్నారు. వారిలో 14 మంది వివిధ ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలతో పని చేస్తున్నారు. అయితే, పౌరులందరూ సురక్షితంగా ఉన్నారని భారత రాయబార కార్యాలయం హామీ ఇచ్చింది.
మరోవైపు సిరియా పరిణామాలు మీద భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. విదేశాంగ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ, “ప్రభుత్వం పరిణామాలపై నిశితంగా గమనిస్తోంద. ముఖ్యంగా దేశంలోని ఉత్తర ప్రాంతాలలో తీవ్రమైన పోరాటాలు, చిక్కుకున్న లేదా సహాయం అవసరమయ్యే భారతీయ పౌరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది” అని తెలిపారు.
భారతీయుల క్షేమం పట్ల ఆందోళన వద్దని రాయబార కార్యాలయం హామీ ఇచ్చింది.