భారత రెజ్లింగ్ సమాఖ్యకు వ్యతిరేకంగా రెజ్లర్లు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. కేంద్రంతో వారు జరిపిన చర్చలు ఫలించలేదు. తాజాగా వాళ్లు ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేశారు. రెజ్లింగ్ ఫెడరేషన్లో జరుగుతున్న అవకతవకలు, తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఫిర్యాదులేఖలో పేర్కొన్నారు. నాలుగు డిమాండ్లను అసోసియేషన్ ముందుంచారు. వినేశ్ ఫోగట్ కు ఒలింపిక్స్లో మెడల్ రాకపోవడంతో ఆమెను టార్చర్ చేశారని తోటి రెజ్లర్లు సైతం ఆరోపిస్తున్నరు. యువ మహిళా రెజ్లర్లపైన కూడా బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వేధింపులకు పాల్పడుతున్నట్లు అనేక మంది ఫిర్యాదు చేసినట్లు పీటీఉషకు రాసిన ఆ లేఖలో తెలిపారు.ప్రస్తుతం ఉన్న భారత రెజ్లింగ్ సమాఖ్యను రద్దు చేయాలని, ఆ శాఖ అధ్యక్షుడిని తొలగించాలని వాళ్ల ప్రధాన డిమాండ్.